రూ.15వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు జూనియర్ అసిస్టెంట్ ఎస్కే రబ్బానిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్మిక కమిషనర్ కార్యాలయంలో జరిగింది.
అనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి రజిత భర్త మేస్త్రీ పని చేసేవాడు. భర్త మృతి చెందిన కారణంగా అతనికి సంబంధించిన కార్మిక బీమా క్లెయిమ్ చేయడానికి కమిషనర్ కార్యాలయానికి వెళ్లింది. జూనియర్ అసిస్టెంట్‌ను సంప్రదించగా 30 వేల రూపాయలు డిమాండ్ చేశారని.. స్థోమత లేక వెళ్లిపోయానని రజిత తెలిపింది. మరోసారి వెళ్లినా.. లంచం అడగడంతో 15 వేలు ఇచ్చానని ఆమె స్పష్టం చేసింది.
లంచం ఇవ్వడం ఇష్టంలేని రజిత ఏసీబీ అధికారులను సమాచారం ఇవ్వగా.. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తన సిబ్బందితో దాడి చేసి రబ్బానిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇదీ చూడండి: వేధింపులు తాళలేక.. స్టేషన్ ఎదుటే ఆటోను తగలబెట్టేశాడు!