సంగారెడ్డి జిల్లా కొల్లూరు జరిగిన ఘటనపై లంబాడి ఐక్యవేదిక ఆందోళనకు దిగింది. ప్రేమలతను హత్య చేసి అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని లంబాడి ఐక్యవేదిక అధ్యక్షుడు రాజు డిమాండ్ చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు.
రామచంద్రాపురం మండలం కొల్లూరు తండాలో ప్రేమలత అనే మహిళ అపహరణకు గురై అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. మియాపూర్‌కు చెందిన మృతురాలికి కొల్లూరు తండాకు చెందిన ఓ వ్యక్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె భర్త కొంతకాలం క్రితం చనిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మంగళవారం సాయంత్రం దుకాణానికి వెళ్తున్నాని చెప్పిన ప్రేమలత తిరిగి రాలేదని ఆమె సోదరి తెలిపారు. గురువారం మధ్యాహ్నం కొల్లూరు శివారులోని ఓ రేకుల షెడ్డులో ఆమె మృతదేహం లభ్యమైంది. మృతురాలి ఒంటిపై బట్టలు లేవని ప్రేమలత బంధువులు, స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండి: వైద్యులు చికిత్స అందించట్లేదని రోగి ఆత్మహత్య..!