కుమురం భీం జిల్లా సిర్పూర్ టి మండలంలో విషాదం జరిగింది. జక్కపూర్కు చెందిన కల్యాణి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపించారు.
మంచిర్యాల జిల్లా బిమిని మండలానికి చెందిన కల్యాణికి, సిర్పూర్ టి మండలం జక్కపూర్కు చెందిన రవితో మూడేళ్ల క్రితం వివాహమైంది. భార్యభర్తలిద్దరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవ జరుగుతోంది. శుక్రవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరగడం వల్ల మనస్తాపం చెందిన కల్యాణి... పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.