ETV Bharat / jagte-raho

ప్రేమ వివాహం ఎఫెక్ట్​: అంతిమ యాత్రలో ఉద్రిక్త పరిస్థితి - mahabubabad updates about crime

గంధంపల్లి గ్రామంలో ఓ జంట ప్రేమ వివాహం చేసుకోగా.. బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో బుధవారం ఒకరు మృతి చెందారు. అయితే గురువారం ఆ వ్యక్తి అంతిమ యాత్రలో ఏర్పడిన ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. హత్యకు కారణం అయిన వ్యక్తి ఇంటిని, షాపును ధ్వంసం చేశారు. కూరగాయల బండిని తగులబెట్టారు.

A tense situation on the final journey at gandhampalli village in mahabubabad
ప్రేమ వివాహం ఎఫెక్ట్​: అంతిమ యాత్రలో ఉద్రిక్త పరిస్థితి
author img

By

Published : Oct 9, 2020, 2:03 PM IST

ప్రేమ వివాహం విషయమై ఇరువర్గాల బంధువుల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి మృతి చెందగా.. అతని అంతిమ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో చోటుచేసుకుంది.

బుధవారం రాత్రి అమ్మాయి తరపు బంధువులు మాతంగి రమణయ్యపై దాడి చేయడంతో మృతి చెందాడు. గురువారం అంతిమ యాత్రలో రమణయ్య బంధువులు హత్యకు కారణం అయిన వ్యక్తి ఇంటిని, షాపును ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న కూరగాయల బండిని రోడ్డుపైకి తీసుకొచ్చి తగులబెట్టారు. డీఎస్పీ నరేశ్​కుమార్ ఆధ్వర్యంలో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి దహన సంస్కారాలను పూర్తి చేపించారు. ప్రేమ వివాహం చేసుకున్న వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు.

ఇదీ చూడండి:ఉద్రిక్తతకు దారితీసిన భూవివాదం.. ఈదుల నాగులపల్లిలో ఘర్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.