కాన్పుకోసం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన గర్భిణీ... వైద్యుల నిర్లక్ష్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉంది. వైద్యుల పొరపాటు తోనే తమ బిడ్డకు ఈ పరిస్థితి వచ్చిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణానికి చెందిన సారయ్య కుమార్తె ప్రసవం కోసం కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా... ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. మూడు రోజులు ఆస్పత్రిలో ఉంచి ఇంటికి పంపేశారు. కానీ అప్పటి నుంచి ఆమెకు కడుపునొప్పి రావడం వల్ల మరోసారి ఆస్పత్రిలో చేర్పించగా... అక్కడి నుంచి ఖమ్మంలోని మరో ఆస్పత్రికి పంపించారు. అక్కడి వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేసి చూడగా మొదటిసారి ఆపరేషన్ చేసిన సమయంలో పేగుకు రంద్రం ఏర్పడిందని... అక్కడి వైద్యులు ఆమెను హైదరాబాద్కు పంపించారు.
పుట్టిన బిడ్డను 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తల్లిదండ్రుల వద్ద ఉంచి... ఆ తల్లి హైదరాబాదులో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని బాధిత కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చయినా తమ బిడ్డకు ఈ పరిస్థితి వచ్చిందని రోధిస్తున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చూడండి: వేగంగా ఢీ కొట్టిన గుర్తు తెలియని వాహనం.. వ్యక్తి మృతి