ETV Bharat / jagte-raho

దొంగకోళ్లు పట్టుకునే మొహాన్ని ఎప్పుడైనా చూశారా...?

author img

By

Published : Jun 22, 2020, 5:06 PM IST

దొంగకోళ్లు పట్టుకునే మొహం చూడు... అని తిట్టడం మనం వింటూనే ఉంటాం. కానీ ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కంచిలిలో అలాంటి వ్యక్తి సీసీ కెమెరాకు చిక్కాడు. రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్​లో దొంగతనం చేసి నిఘా నేత్రాలకు చిక్కాడు. ఈ తరహ చోరీలతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

a-man-who-is-stealing-chickens-in-a-roadside-hotel-at-kanchili-in-srikakulam-district andhra pradesh
దొంగకోళ్లు పట్టుకునే మొహాన్ని ఎప్పుడైనా చూశారా...?

ఆంధ్రప్రదేశ్​ శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలో కోళ్ల దొంగ సీసీ కెమెరాకు చిక్కాడు. స్థానికంగా ఉండే సంతకు సమీపంలోని ఓ హోటల్​లో ఆదివారం నాడు ఈ దొంగతనం జరిగింది. విలువైన జాతి కోళ్లు ఎత్తుకెళ్లిపోయినట్టు హోటల్​ నిర్వాహకులు చెబుతున్నారు. జాతీయ రహదారి పక్కనే ఉండే ఈ హోటల్​లో నిత్యం చాలా మంది డ్రైవర్లు భోజనాలు చేస్తుంటారు.

అలా వచ్చిన వాళ్లా, లేక స్థానికులే ఈ చోరీలకు పాల్పడ్డుతున్నారా... అనే అనుమానం వ్యక్తమవుతోంది. అయితే దొంగ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కాకపోవచ్చని సీసీ కెమెరా చూసిన పోలీసులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. దొంగతనం చుట్టుపక్కల గ్రామాల్లో కలకలం రేపింది.

ఇదీ చూడండి: కర్నల్​ సంతోష్​బాబు కుటుంబాన్నిపరామర్శించిన సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.