రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్టేషన్ పరిధిలోని ఓ బాలుడు కారు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఉప్పర్పల్లి అశోక్ విహార్ ఫేజ్ 2లోని ఓ అపార్ట్మెంట్లో ఆడుకుంటూ ఉండగా పార్కింగ్ నుంచి బయటకు వెళుతున్న గ్జైలో వాహనం బాలుడిని ఈడ్చుకుంటూ వెళ్లింది. బాలుడు కారు మధ్యలో ఉండటంతో చిన్న పాటి గాయాలతో బయటపడ్డాడు.
గమనించి స్థానికులు తల్లిదండ్రలకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా... అపార్ట్మెంట్లో ఉద్యోగులను దించేందుకు వచ్చిన వాహనంగా గుర్తించిన తల్లిదండ్రులు... పోలీసులకు సమాచారం అందించారు. నిన్న మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇదీ చదవండి : పందెం కోడి కాలు దువ్వింది.. బరిలోకి దునికింది!