ETV Bharat / jagte-raho

ప్రమాదవశాత్తు గుంతలో పడి చిన్నారి మృతి - ప్రమాదవశాత్తు గుంతలో పడి చిన్నారి మృతి

అప్పటివరకు బుడిబుడి అడుగులు వేస్తూ... కళ్ల ముందు తిరిగింది ఆ చిన్నారి. ఇంతోలనే ఏమైందో తెలియదు కాని ఇంటిముందు ఉన్న గుంతలో విగతజీవిగా కనిపించింది 18 నెలల చిట్టితల్లి. ఈ విషాద ఘటన గూడూరు మండలం బొల్లేపల్లి శివారు పంచరాయితండాలో జరిగింది.

18-moths-girl-child-dies-after-falling-into-septic-tank-in-pancharaitanda-at-guduru-mandal-mahabubabad-district
ప్రమాదవశాత్తు గుంతలో పడి చిన్నారి మృతి
author img

By

Published : Jul 16, 2020, 8:12 AM IST

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బొల్లేపల్లి శివారులోని పంచరాయితండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన అజ్మీర వీరన్న, కల్యాణి దంపతులకు నాలుగు ఏళ్ల కుమారుడు, 18 నెలల కూతురు పింకి ఉన్నారు. సాయంకాలం తల్లిదండ్రులు ఇంట్లో ఉండగా చిన్నారి పింకి... తోటి చిన్న పిల్లలతో ఆడుకుంటూ ఉంది. కొద్దిసేపటి తర్వాత కల్యాణి బయటకు వచ్చి చూడగా పాప కనిపించలేదు. వెంటనే చుట్టు పక్కల ఇళ్లలో వెతికారు. ఎక్కడా కనిపించలేదు. అనుమానంతో ఇంటిముందు మరుగుదొడ్డి కోసం తీసిన గుంతలో చూడగా... ఆ చిట్టితల్లి విగతజీవిగా కనిపించింది.

వెంటనే గూడూరులోని ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా... పాప చనిపోయినట్లు వైద్యులు నిర్దరించారు. అప్పటివరకు బుడిబుడి అడుగులు వేస్తూ... కళ్లముందు తిరిగిన చిన్నారి ఇక లేదని తెలిసిన తల్లిదండ్రులు, బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇదీ చూడండి: ప్రేమ విఫలమైందని.. యువతి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.