ETV Bharat / jagte-raho

8 ఏళ్ల దివ్యాంగురాలైన బాలికపై 15 ఏళ్ల మైనర్​ అత్యాచారం - Rape of Minor Girl Latest News

మహిళలకే కాదు.. చిన్నారులకు సైతం భద్రత లేకుండా పోయింది. ఓ ఎనిమిదేళ్ల దివ్యాంగురాలైన బాలికపై 15 ఏళ్ల మైనర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

8 ఏళ్ల  దివ్యాంగురాలైన బాలికపై 15 ఏళ్ల మైనర్​ అత్యాచారం

author img

By

Published : Nov 2, 2020, 5:59 PM IST

ఎనిమిదేళ్ల దివ్యాంగురాలైన బాలికపై 15 ఏళ్ల మైనర్​ బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా కోహీర్​ మండలం వెంకటాపూర్​లో ఆలస్యంగా వెలుగు చూసింది. బాలిక పక్కింట్లో ఉండే బాలుడు ఆదివారం... మధ్యాహ్నం దివ్యాంగురాలి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు జహీరాబాద్​ డీఎస్పీ శంకర్​ రాజు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను జహీరాబాద్​లోని వైద్య విధాన పరిషత్ ప్రాంతీయ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించినట్లు డీఎస్పీ తెలిపారు.

నిందితుడు మైనర్ కావడంతో బాలల హక్కుల ప్రకారం బాల నేరస్థుల జైలుకు పంపనున్నట్లు డీఎస్పీ చెప్పారు. అత్యాచారం ఘటనతో వెంకటాపూర్​లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు నిఘా ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: ఝార్ఖండ్​ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.