ETV Bharat / international

భార్యతో వివాదం- 12 మందిని చంపిన వ్యక్తి - భార్యతో వివాదం

యెమెన్​లో ఓ వ్యక్తి సొంత కుటుంబాన్నే పొట్టన పెట్టుకున్నాడు. భార్య, ముగ్గురు పిల్లలతో సహా 12 మందిని కాల్చి చంపాడు. భార్యతో చెలరేగిన వివాదం కారణంగా ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు.

YEMEN-FAMILY-SHOOTING
యెమెన్
author img

By

Published : Oct 13, 2020, 9:37 PM IST

యెమెన్​లోని బైదా రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలు సహా మొత్తం 12 మందిని చంపేసినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. కుటుంబ వివాదానికి సంబంధించి ఈ హత్యలు జరిగినట్లు తెలిపారు. అనంతరం పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ వ్యక్తి హతమైనట్లు స్పష్టం చేశారు.

హంతకునికి తన భార్యతో వివాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు 20 రోజుల కింద ఓ బిడ్డకు జన్మనిచ్చిన నేపథ్యంలో తన తండ్రి ఇంటి వద్ద ఉంటోంది. సమస్య పరిష్కారంపై చర్చించేందుకు వెళ్లిన నిందితుడు.. 20 రోజుల శిశువుతో సహా అందరిపై కాల్పులు జరిపాడు.

ఈ క్రమంలో పోలీసులపైనా దాడి చేయగా ముగ్గురు గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన అతడ్ని భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు.

ఇదీ చూడండి: గిల్గిత్​ బాల్టిస్థాన్​లో పాక్​ సర్కారుకు నిరసన సెగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.