దక్షిణ టర్కీలో పలు చోట్ల చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టించింది. మర్మరిస్, అంటల్యా, బొడ్రం ప్రాంతాల్లో వందలాది ఇళ్లు, ఆస్తులు కాలి బూడిదయ్యాయి. అంటల్యాలోని మధ్యదరా సముద్ర తీర ప్రాంతం మనవ్గట్లో మంటల్లో చిక్కుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో జనం తీవ్రంగా గాయపడ్డారు. కార్చిచ్చు ఉద్ధృతంగా వ్యాపిస్తున్నందున సమీప ప్రాంత ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు. గాయపడ్డవారికి చికిత్స అందిస్తున్నారు.
కార్చిచ్చు విధ్వంసం దాటికి అంటల్యా మనవ్గట్లోని చాలా గ్రామాలు నామరూపాల్లేకుండా పోయాయి.


మర్మరిస్లోని ఓ పర్యటక హోటల్‌కు సమీపంలో మంటలు చెలరేగాయి. పర్యటకులంతా భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు.





