టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం దెబ్బకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకు మొత్తం 27 మంది మరణించారు. మరో 800 మందికిపైగా గాయపడ్డారు. రెండు దేశాల్లోని తీర ప్రాంత నగరాలు, పట్టణాలు.. భూకంపం ధాటికి చిగురుటాకుల్లా వణికాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పరుగులు పెట్టారు. భూకంప తీవ్రతకు ఇజ్మిర్‌లో ఇరవైకి పైగా బహుళ అంతస్తుల భవనాలు కుప్పకూలాయి.
టర్కీ పశ్చిమ తీరం, గ్రీస్‌ద్వీపం సామోస్‌ల మధ్య ఏజియన్ సముద్రంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూకంప తీవ్రత 6.6గా నమోదైనట్లు టర్కీ అధికారులు తెలిపారు. భూప్రకంపనల దెబ్బకు ఇజ్మిర్ ప్రావిన్స్‌లో ఎక్కువ నష్టం వాటిల్లింది. దాదాపు 3 వేల మంది ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రెడ్ క్రాస్ సంస్థ బాధితులకు వైద్య సాయం అందిస్తోంది. భూకంపం ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు.