ETV Bharat / international

గర్భంతో ఉన్న మహిళా పోలీస్ దారుణ హత్య- తాలిబన్ల పనే! - మహిళా పోలీసుని హత్య చేసిన తాలిబన్లు

అఫ్గాన్​లో నిండు గర్భిణి అయిన మహిళా పోలీస్​ను తాలిబన్లు కాల్చి చంపారని బీబీసీ వార్తా సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ హత్యపై తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్​ వర్గాలు తెలిపాయి.

Taliban kill female police officer
తాలిబన్ల ఆకృత్యాలు
author img

By

Published : Sep 6, 2021, 9:55 AM IST

అఫ్గాన్​లో మహిళలపై ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. నిండు గర్భంతో ఉన్న ఓ పోలీస్​ను తాలిబన్లు కాల్చిచంపారని బీబీసీ వార్తా సంస్థ తెలిపింది. సెంట్రల్​ ఘోర్​ ప్రావిన్స్​లో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించింది. కుటుంబ సభ్యుల ముందే ఆ మహిళను కాల్చేశారని పేర్కొంది.

ఎనిమిది నెలల గర్భంతో ఉన్న నేగర్ అనే మహిళా పోలీసు.. స్థానికంగా ఓ జైళ్లో విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారినిని చంపడానికి వచ్చిన ముగ్గురు దుండగులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. వారు అరబిక్​ మాట్లాడుతున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మేం కాదు: తాలిబన్లు

అయితే, ఈ హత్యతో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్లు తెలిపారు. ఈ హత్యపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. అయితే.. తాలిబన్ల భయంతో ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడటానికి సాహసించట్లేదు.

ఇదీ చదవండి:సంబరాల పేరుతో 17 మందిని కాల్చి చంపిన తాలిబన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.