ETV Bharat / international

పెగసస్​పై అమెరికా ఆంక్షలు.. వెనక్కి తగ్గిన ఇజ్రాయెల్! - అమెరికా పెగసస్

పెగసస్ తయారీ సంస్థ అయిన ఎన్ఎస్ఓ గ్రూప్​తో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ స్పష్టం చేశారు. ఎన్ఎస్ఓ గ్రూప్.. ఓ ప్రైవేటు కంపెనీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఈ గ్రూప్​ను అమెరికా బ్లాక్​లిస్ట్​లోకి చేర్చిన నేపథ్యంలో.. ఈ మేరకు స్పందించారు.

NSO GROUP israel
NSO GROUP israel
author img

By

Published : Nov 8, 2021, 3:42 PM IST

పెగసస్ స్పైవేర్ తయారు చేసిన ఎన్​ఎస్ఓ గ్రూప్​ను (NSO group) అమెరికా బ్లాక్​లిస్ట్​లో చేర్చడం సహా.. అంతర్జాతీయంగా ఈ సంస్థపై వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఎన్​ఎస్ఓ గ్రూప్​తో (NSO Pegasus) ఇజ్రాయెల్ ప్రభుత్వానికి సంబంధం లేదని ప్రకటించింది. ఎన్​ఎస్​ఓ ఓ ప్రైవేటు సంస్థ మాత్రమేనని స్పష్టం చేసింది. ఆ కంపెనీకి ఇజ్రాయెల్ గుర్తింపు ఇచ్చినప్పటికీ.. ప్రభుత్వ విధానాలతో ఎన్ఎస్​ఓ గ్రూప్​నకు ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ మంత్రి యాయిర్ లాపిడ్ తెలిపారు. ఇజ్రాయెల్ ప్రధాని నాఫ్తాలీ బెన్నెట్, ఆర్థిక మంత్రి ఆవిగ్డోర్ లిబర్​మన్​తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు.

సైబర్ రంగంలో ఇజ్రాయెల్ కఠిన నిబంధనలు అమలు చేస్తోందని లాపిడ్ పేర్కొన్నారు. ప్రపంచంలో మరే ఇతర దేశం కూడా ఇలాంటి నిబంధనలు పాటించడం లేదని చెప్పారు. ఈ నిబంధనలను ఇంతే కఠినంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

అమెరికా ఆంక్షలు

స్పైవేర్​ను దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలతో ఎన్ఎస్​ఓ గ్రూప్​ను (NSO Group Pegasus) బ్లాక్​లిస్ట్​లోకి చేర్చింది అమెరికా. జాతి భద్రత, విదేశాంగ విధానాలకు వ్యతిరేకంగా ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తోందని పేర్కొంది. స్పైవేర్​ను విదేశాల్లోని ప్రభుత్వాలకు సరఫరా చేసి.. ప్రభుత్వ అధికారులు, జర్నలిస్ట్​లు, వ్యాపారవేత్తలు, ఉద్యమకారులు, విద్యావేత్తలు, రాయబారులపై నిఘా వేశారని ప్రకటనలో తెలిపింది. ఈ సాఫ్ట్​వేర్​ను ఉపయోగించి నియంతృత్వ ప్రభుత్వాలు.. తమపై అసమ్మతి వ్యక్తం చేసేవారిని అణచివేశాయని పేర్కొంది. ఇలాంటి కార్యకలాపాలు అంతర్జాతీయ విధానాలకు భంగం కలిగిస్తాయని అభిప్రాయపడింది.

పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ నిఘా!

మరోవైపు, పెగసస్ స్పైవేర్​ను ఉపయోగించి పాలస్తీనా మానవహక్కుల ఉద్యమకారులపై నిఘా వేసినట్లు తాజాగా వెల్లడైంది. ఆరుగురు ఉద్యమకారుల ఫోన్లలో ఈ స్పైవేర్​ ఆనవాళ్లు బయటపడ్డాయి. 'ఫ్రంట్​లైన్ డిఫెండర్స్​' అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన మహమ్మద్ అల్ మస్కాటి ఈ విషయాన్ని గుర్తించారు.

అయితే, వారి ఫోన్లలో ఎవరు స్పైవేర్​ను చొప్పించారనే విషయం తెలియలేదని మస్కాటి పేర్కొన్నారు. అక్టోబర్ మధ్యలో ఇద్దరి ఫోన్లలో సైబర్ దాడి జరిగిందని తెలిపారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఆరు పాలస్తీనా సివిల్ సొసైటీ గ్రూప్​లపై.. ఉగ్రవాద ముద్ర వేస్తూ ఇజ్రాయెల్ రక్షణ మంత్రి బెన్నీ గంట్జ్ ప్రకటన చేశారని వివరించారు. హ్యాకింగ్​కు గురైన ఆరుగురిలో ముగ్గురికి ఈ సివిల్ సొసైటీలతో సంబంధం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెలే హ్యాకింగ్​కు పాల్పడి ఉండొచ్చని ఇద్దరు బాధితులు అనుమానం వ్యక్తం చేశారని వెల్లడించారు. సివిల్ సొసైటీ గ్రూప్​లు ఉగ్ర సంస్థలని చెప్పేందుకు సరైన ఆధారాలు కూడా ఇజ్రాయెల్ చూపించలేదని మస్కాటి పేర్కొన్నారు.

ఏంటీ పెగసస్?

ఇజ్రాయెల్​కు చెందిన ఎన్ఎస్​ఓ గ్రూప్.. రూపొందించిన హ్యాకింగ్ సాఫ్ట్​వేరే పెగసస్. ప్రభుత్వాలకు, దర్యాప్తు ఏజెన్సీలకు మాత్రమే పెగసస్ సాఫ్ట్​వేర్​ను విక్రయిస్తుంది ఎన్ఎస్ఓ గ్రూప్. ఉగ్రవాదం, నేరాలపై దర్యాప్తు చేసేందుకు మాత్రమే దీన్ని వినియోగించాల్సి ఉంటుంది. అయితే, భారత్​ సహా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ స్పైవేర్​ను దుర్వినియోగం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇదీ చదవండి: పెగసస్​పై నిజాలు వెలుగు చూడాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.