ETV Bharat / international

ఇరాన్​పై ఆంక్షలను బైడెన్​ తొలగిస్తారు: రౌహానీ - Iran's president hopes Biden

ఇరాన్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధించిన ఆంక్షలు, తప్పుడు విధానాలను జో బైడెన్​ తొలగిస్తారని భావిస్తున్నారు ఆ దేశ అధ్యక్షుడు హసన్​ రౌహానీ. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం దిశగా బైడెన్ చర్యలు చేపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Iran's president hopes Biden unravels Trump's Iran policies
'ఇరాన్​పై అమెరికా ఆంక్షలను బైడెన్​ తొలగిస్తారు'
author img

By

Published : Nov 25, 2020, 5:45 PM IST

ఇరాన్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధించిన ఆంక్షలను.. నూతనంగా అధ్యక్ష పదవికి ఎన్నికైన జో బైడెన్​ తొలగిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఇరాన్ అధ్యక్షుడు హసన్​ రౌహానీ. టెహ్రాన్​ అణు ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించి ప్రపంచశక్తులతో చేరేందుకు ప్రయత్నస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడి 2017 జనవరి 20 ముందు నాటికి చేరుకుంటాయన్నారు. తద్వారా ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు రౌహానీ. ట్రంప్​ పాలనలో ఇరాన్​పై.. అమెరికా అనుసరించిన తప్పుడు విధానాల వల్ల గడిచిన నాలుగేళ్లలో తీవ్ర నష్టం జరిగిందని, దానికి పరిహారం చెల్లించాలని అన్నారు.

దెబ్బతిన్న సంబంధాలు..

ట్రంప్​ పాలనలో ఇరుదేశాల మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిని.. యుద్ధవాతావరణం నెలకొంది. ముఖ్యంగా 2018లో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం వల్ల ఇరాన్​పై ఉన్న ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయడానికి బదులుగా యురేనియం ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడింది. అంతే కాకుండా ఇరాన్​ విషయంలో ట్రంప్​ వ్యవహరించిన తీరు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది.

ఇదీ చూడండి: న్యూజిలాండ్​ ఎంపీగా సంస్కృతంలో ప్రమాణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.