Black Diamond: వజ్రాల్లో చాలా రంగులు ఉంటాయని విన్నాం. కానీ నల్ల రంగులో ఉన్న వజ్రాన్ని ఎప్పుడైనా చూశారా? అవును.. ప్రపంచంలోనే అత్యంత అరుదైన నల్ల వజ్రం వేలానికి సిద్ధమైంది. దుబాయ్‌లోని ప్రఖ్యాత వజ్రాల వేలం సంస్థ సోత్‌బై.. ఈ వజ్రాన్ని వచ్చేనెలలో లండన్‌లో వేలం వేయనుంది. ఈ అరుదైన నల్ల వజ్రం 555.5 క్యారెట్ల బరువు ఉన్నట్లు సోత్‌బై తెలిపింది.
55 ముఖాలు..
ఈ బ్లాక్ డైమండ్ 'ది ఎనిగ్మా' .. కాలక్రమేణా విశ్వంలోని సుదూరం ప్రాంతం నుంచి భూమిపైకి వచ్చినట్లు సోత్‌బై సంస్థలో పనిచేసే జువెలరీ నిపుణురాలు సోఫీ స్టీవెన్స్ పేర్కొన్నారు. ఈ వజ్రం ప్రారంభ ధర రూ. 50 కోట్లు ఉంటుందని తెలిపారు. ఈ వజ్రం 55 ముఖాలు కలిగిఉందని వివరించారు.
బ్లాక్ డైమండ్స్‌ను కార్బొనాడో అనికూడా పిలుస్తారు. ఈ వజ్రాలు చాలా అరుదుగా లభిస్తుంటాయి. కేవలం బ్రెజిల్, మధ్య ఆఫ్రికా ప్రాంతాల్లోనే ఇవి లభ్యమైతుంటాయి.
ఇదీ చూడండి: రెండో పెళ్లికి మ్యారేజ్ బ్యూరో 'నో'- ఆత్మాహుతికి 64 ఏళ్ల వృద్ధుడి యత్నం!