ETV Bharat / international

ఇజ్రాయెల్​కు పెద్ద ఎత్తున 'అమెరికా' ఆయుధాల విక్రయం - ఆయుధాల విక్రయం

ఇజ్రాయెల్​కు అధునాతన ఆయుధాలను సరఫరా చేసే కీలక ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ ఆమోదం తెలిపారు. లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదించగల సామర్థం ఉన్న ఈ ఆయుధాల విలువ 735 మిలియన్​ డాలర్లు. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. బైడెన్​ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Biden admin approves $735mn arms sale to Israel
ఇజ్రాయెల్​కు అమెరికా ఆయుధాలు
author img

By

Published : May 18, 2021, 6:39 PM IST

ఇజ్రాయెల్​కు దాదాపు 735 మిలియన్​ డాలర్లు విలువైన ఆయుధాలను విక్రయించనుంది అమెరికా. సంబంధిత ప్రతిపాదనకు అధ్యక్షుడు జో బైడెన్​ పాలకవర్గం ఆమోదం తెలిపినట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి.

ఇందులో లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించగల ప్రత్యక్ష దాడులు చేసే ఆయుధాలు, మందుగుండు సామగ్రి సహా, జీబీయూ-39 బాంబులు ఉన్నట్లు ది వాషింగ్టన్​ పోస్ట్​ తెలిపింది.

ఇజ్రాయెల్​, పాలస్తీనా మధ్య సంఘర్షణ జరుగుతున్న సమయంలో.. ఈ ఆయుధాల విక్రయం జరుగుతుండటం గమనార్హం. ఈ నిర్ణయంపై.. బైడెన్​ వర్గంలోని కొందరు డెమొక్రాట్లు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇజ్రాయెల్​ సైన్యం, గాజాలోని పాలస్తీనా ఉగ్రవాదుల మధ్య సంఘర్షణకు వారం ముందే( మే 5న).. ఈ ఆయుధాల అమ్మకం ప్రతిపాదన కాంగ్రెస్​కు పంపించినట్లు జిన్ఙువా వార్తా సంస్థ తెలిపింది.

కాల్పుల విరమణకు మద్దతు..

ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుతో సోమవారం సంభాషించిన బైడెన్​.. కాల్పుల విరమణకు మద్దతు పలికారు. తక్షణమే కాల్పుల విరమణను పాటించాలంటూ డెమొక్రాట్ చట్టసభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో శ్వేతసౌధం నుంచి ఈ ప్రకటన వచ్చింది.

హమాస్ ఉగ్రవాదులు- ఇజ్రాయెల్ సైన్యం మధ్య జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 204 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఇందులో 59 మంది పిల్లలు ఉన్నారు. ఇజ్రాయెల్​కు చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: అతిపెద్ద డైమండ్​ మార్కెట్​ సూరత్​లో- దీపావళికి సిద్ధం​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.