ETV Bharat / international

యూనివర్సిటీల్లో మహిళల ప్రవేశం నిషేధం.. తాలిబన్ ప్రభుత్వం ఆదేశం..

తాలిబన్​ ప్రభుత్వం మరోసారి మహిళా విద్యార్థుల పట్ల ఆంక్షలు విధించింది. మహిళా విద్యార్ధులకు ఉన్నత విద్యను నిలిపేయాలని యూనివర్సిటీలకు రాసిన లేఖలో ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని వెల్లడించింది.

afghanistan
తాలీబన్​ ప్రభుత్వం
author img

By

Published : Dec 21, 2022, 10:19 AM IST

అఫ్గానిస్థాన్​లో మహిళలు భయపడినంత జరుగుతోంది. తాలిబన్లు మరోసారి మహిళల ఉన్నత విద్యపై నిషేధాన్ని విధించారు. గతంలో జరిగిన తప్పులను మళ్లీ జరగనివ్వమని అధికారం చేపట్టినప్పుడు ప్రకటించిన తాలిబన్‌ పాలకులు.. ఇప్పుడు మళ్లీ నిరంకుశ పద్ధతినే అవలంభిస్తున్నారు. యువతుల విశ్వవిద్యాలయ విద్యపై నిరవధిక నిషేధాన్ని విధిస్తున్నట్లు తాలిబాన్ ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు అఫ్గాన్‌లో మహిళా విద్యార్ధులకు ఉన్నత విద్యను నిలిపేయాలని యూనివర్సిటీలకు రాసిన లేఖలో ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశించింది.

2021లో అఫ్గాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు.. మహిళల ప్రాథమిక హక్కులపై కఠిన ఆంక్షలు విధించారు. అఫ్గాన్‌లోని చాలా ప్రావిన్సుల్లో బాలికల సెకండరీ విద్యపై నిషేధం అమల్లో ఉండగా ఇప్పుడు ఉన్నత విద్యపైనా నిషేధం విధించారు. మహిళల ఉద్యోగాలపై పరిమితులు విధించింది. మహిళలు పార్కులు, జిమ్‌లకు సైతం వెళ్లకుండా నిషేధం విధించారు. కాగా, తమ భవిష్యత్తుపై ఈ నిషేధం చాలా ప్రభావం చూపుతోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.