ETV Bharat / international

బార్​లో భీకర దాడి.. బస్​లో వచ్చి బులెట్ల వర్షం.. 15 మంది మృతి - దక్షిణాఫ్రికా బార్​లో కాల్పులు

South Africa shooting
బార్​లో కాల్పులు.. అనేక మంది మృతి
author img

By

Published : Jul 10, 2022, 12:51 PM IST

Updated : Jul 10, 2022, 3:43 PM IST

12:49 July 10

బార్​లో కాల్పులు.. 15 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని ఓ బార్​లో కాల్పులు జరగ్గా 15 మంది మరణించారు. గాయపడిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. జోహెన్నస్​బర్గ్​లోని సెవేటో టౌన్​షిప్​లో ఈ ఘోరం జరిగింది. కొందరు దుండగులు మినీ బస్​లో వచ్చి, బార్​లోకి చొరబడి ఈ ఘాతుకానికి తెగబడ్డారు. శక్తిమంతమైన తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.

"ప్రాథమిక సమాచారం ప్రకారం కొంత మంది వ్యక్తులు చేసినట్లు భావిస్తున్నాం. అకస్మాత్తుగా తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా బయటకు పరిగెత్తారు. నిందితుల లక్ష్యం తెలియదు. శక్తిమంతమైన తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు."

-ఇలియాస్​ మవేలా, పోలీస్​ కమిషనర్​

పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ప్రస్తుతానికి దుండగుల ఉద్దేశం ఏమిటనేది తెలియదని పోలీస్ కమిషనర్​ ఇలియాస్ మవేలా తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: ఘనంగా 'గే' యువరాజు పెళ్లి.. వారి కోసం ఆసియాలోనే తొలి ఆశ్రమం!

Last Updated : Jul 10, 2022, 3:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.