ETV Bharat / international

సుత్తితో కొట్టి తండ్రి హత్య.. శరీరాన్ని ముక్కలుగా నరికి - son kilss father in karachi

Son Killed Father: తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ తనయుడు. సుత్తితో కొట్టి చంపిన అతను.. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు శరీరాన్ని ముక్కలుగా నరికి వాటికి నిప్పింటించి వివిధ ప్రాంతాల్లో పడేశాడు. ఈ అమానుష ఘటన పాకిస్థాన్​లోని కరాచీలో జరిగింది.

Son Kills Father
Son Kills Father
author img

By

Published : May 19, 2022, 8:13 AM IST

Updated : May 19, 2022, 9:57 AM IST

Son Killed Father: సొంత తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ తనయుడు. 52 ఏళ్ల వయసున్న తండ్రిని ముక్కముక్కలుగా చేసి చంపాడు. అనంతరం శరీర భాగాలను వివిధ ప్రదేశాలకు తీసుకువెళ్లి వాటికి నిప్పింటించాడు. ఈ అమానుష ఘటన పాకిస్థాన్​లోని కరాచీలో వెలుగుచూసింది. ఈ కేసులో కుమారుడిని బుధవారం అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సుత్తితో కొట్టి తండ్రిని హత్య చేశాడని.. తర్వాత శరీర భాగాలను ముక్కముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో వదిలి వెళ్లినట్లు చెప్పారు.

"నా సుదీర్ఘ కెరీర్‌లో ఇది అత్యంత భయంకరమైన సంఘటన. తండ్రి కొడుతున్నాడనే కారణంతో అతడిని చంపడం అత్యంత దారుణం. తన తండ్రి అని ఏవరు గుర్తు పట్టకూడదు అనుకున్నాడు. ఏప్రిల్​ 21న సుత్తితో కొట్టి హత్య చేసి ముక్కుముక్కలుగా చేసి వివిధ ప్రదేశాల్లో పడేశాడు. ఎవరూ గుర్తుపట్టకుండా శరీరభాగాలకు నిప్పంటించాడు. కానీ కొద్ది రోజుల క్రితం అఫ్గాన్​ బస్తీ వద్ద శరీర భాగాలను గుర్తించడం వల్ల అసలు విషయం బయటపడింది."

-అల్తాఫ్​ హుస్సేన్​ ,ఎస్​ఎస్పీ

కొన్ని రోజుల కింద సూపర్​ హైవేపై అఫ్గాన్​ బస్తీ సమీపంలో తల, కాళ్లు లేకండా ఇతర శరీర భాగాలతో కూడిన ఓ బ్యాగు లభ్యమైందని ఎస్​ఎస్పీ అల్తాఫ్​ హుస్సేన్​ తెలిపారు. ఈ శరీర భాగాలు పీఐబీ కాలనీకి చెందిన సలీం ఖిల్జీగా గుర్తించామని.. అతడి కొడుకుపై అనుమానం వచ్చి విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నట్లు చెప్పారు. తల మొండెం లేని శరీరాన్ని గుర్తించడానికి ఫోరెన్సిక్​ బృందం చాలా కష్టపడిందన్నారు. తండ్రిని హత్య చేసిన అనంతరం తలను లియారీ నదిలో, కాళ్లను జూబ్లీ మార్కెట్​లో, ఇతర భాగాలను అఫ్గాన్​ బస్తీ సమీపంలో వదిలివెళ్లినట్లు ఆయన చెప్పారు.

ఇదీ చదవండి: చైనా కుట్ర.. 'పాంగాంగ్' వద్ద మరో వంతెన.. భారీగా సైన్యాన్ని తరలించేలా..

Last Updated : May 19, 2022, 9:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.