Somalia Bomb Attack : సోమాలియాలో మరో బాంబుల వాహనం విధ్వంసం సృష్టించింది. సెంట్రల్ సోమాలియాలోని ఓ మాంసం దుకాణం వద్దకు దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉంది. ఒక్క రోజులోనే ఇది మూడో ఘటనని అధికారులు చెప్పారు. కాగా, ఈ ఘటనపై ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. గురువారం ఉదయం హిరాన్ పరిధిలోని రెండు ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయి. అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపేందుకు ప్రయత్నించిన ముగ్గురు సైనికులను దుండగులు కాల్చిచంపారు. మార్కెట్‌కు సమీపంలోని ఆర్మీ కమాండర్ ఇంటిని లక్ష్యంగా చేసుకునే.. ఈ దాడికి ప్రయత్నించారని అధికారులు భావిస్తున్నారు.
Somalia Bomb Blast : అంతకుముందు శనివారం భద్రతా చెక్‌పోస్టు వద్ద జరిగిన పేలుడు ఘటనలో 18 మంది మృతి చెందారు. మరో 40 మంది గాయపడ్డారు. మధ్య సోమాలియాలోని బెలెడ్‌వెయిన్ నగరంలో శనివారం ఈ ఘటన జరిగింది. వీరిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుడు పదార్థాలతో కూడిన ట్రక్కు.. ప్రభుత్వం ఆధీనంలోని చెక్‌పోస్ట్‌పైకి దూసుకువచ్చిందని ప్రత్యక్ష సాక్షి అబ్దికదిర్ అర్బా చెప్పారు. భద్రత అధికారులు వాహనం దాన్ని వెంబడిస్తుండగా ఒక్కసారిగా అది పేలిందని తెలిపారు.
Somalia Bombing 2023 : తూర్పు ఆఫ్రికాలో అల్‌ఖైదాకు అనుబంధ సంస్థగా ఉన్న అల్ షబాబ్ తీవ్రవాదులపై సోమాలియా ప్రభుత్వం ఇటీవలే సైనిక దాడి చేపట్టింది. కాగా తాజా పేలుడుకు బాధ్యత వహిస్తూ అల్ షబాబ్ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా రాజధాని.. 100 మంది మృతి
కొద్ది రోజుల క్రితం కూడా సోమాలియా రాజధానిలో ఒక్కసారిగా రెండు చోట్ల భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. ఘఠన జరిగింది. పేలుళ్లలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయారు. విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద ఈ ఘటన జరిగింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.