ETV Bharat / international

Singapore New President : సింగపూర్​ కొత్త అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక.. భారత సంతతికి చెందిన మూడో వ్యక్తిగా..

Singapore New President : సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి ధర్మన్‌ షణ్ముగరత్నం విజయం సాధించారు. 2011 తర్వాత దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతి అభ్యర్థులను ఓడించి షణ్ముగరత్నం భారీ మెజారిటీతో గెలిచినట్లు ఎన్నికల కమిటీ నిర్ధరించింది.

Singapore New President
Singapore New President
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 6:40 AM IST

Updated : Sep 2, 2023, 10:39 AM IST

Singapore New President : సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి ధర్మన్‌ షణ్ముగరత్నం (66) సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు. ఆయన విజయాన్ని ఎన్నికల కమిటీ ధ్రువీకరించింది. 2011 తర్వాత దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులను ఓడించి షణ్ముగరత్నం భారీ మెజారిటీతో గెలిచారు.

సింగపూర్​లో శుక్రవారం జరిగిన ఎన్నికల్లో షణ్నుగరత్నానికి 70.4శాతం ఓట్లు పోలయ్యాయి. ఆయన ప్రత్యర్థులు ఎంగ్‌ కోక్‌సోంగ్‌, టాన్‌ కిన్‌ లియాన్‌లకు వరుసగా 15.7 శాతం, 13.88శాతం ఓట్లు వచ్చినట్టు ఎన్నికల కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మొత్తం 27 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా..
Singarpore Presidential Elections 2023 : రిటర్నింగ్‌ అధికారి ప్రకటించిన ఈ ఫలితాలతో సింగపూర్‌కు భారతీయ సంతతికి చెందిన మూడో అధ్యక్షుడిగా షణ్ముగరత్నం ఎన్నిక ఖరారైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి లీ సీన్‌ లూంగ్‌ ఆయనను అభినందించారు. ప్రధాని లీ సారథ్యంలోని పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీ (పీఏపీ) ఈ ఎన్నికల్లో షణ్ముగరత్నంకు అండగా నిలిచింది. ప్రస్తుత అధ్యక్షురాలు హలీమా యాకూబ్‌ పదవీకాలం సెప్టెంబరు 13న ముగియనుంది.

తనపై ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తా
Tharman Shanmugaratnam Singapore : సింగపూర్‌ అధ్యక్ష ఎన్నికల్లో గెలవడం పట్ల షణ్ముగరత్నం సంతోషం వ్యక్తం చేశారు. ఫలితాల అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడారు. సింగపూర్‌వాసులు తనకు బలమైన ఆమోదం తెలిపారన్నారు. తనను గెలిపించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. "ఇది నాకు వేసిన ఓటు కాదు. సింగపూర్‌ భవిష్యత్తుకు, ఆశావాద దృక్పథానికి వేసిన ఓటు. ఆశావాద దృక్పథం, ఐక్యతే ప్రధానంగా నేను ప్రచారం చేశారు. సింగపూర్‌ వాసులు కోరుకున్నది కూడా ఇదేనని నేను నమ్ముతున్నాను" అని షణ్ముగరత్నం అన్నారు. తనపై సింగపూర్‌ వాసులు ఉంచిన నమ్మకాన్ని గౌరవిస్తానన్నారు.

మోదీ శుభాకాంక్షలు
Tharman Shanmugaratnam Modi : సింగపూర్​ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతకి చెందిన షణ్ముగరత్నానికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. "సింగపూర్ అధ్యక్షుడిగా మీరు ఎన్నికైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్​-సింగపూర్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నేను ఎదురు చూస్తున్నాను" అంటూ మోదీ ట్వీట్​ చేశారు.

  • Hearty congratulations @Tharman_s on your election as the President of Singapore. I look forward to working closely with you to further strengthen the India-Singapore Strategic Partnership.

    — Narendra Modi (@narendramodi) September 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఆర్థికవేత్త నుంచి అధ్యక్షుడిగా..
Tharman Shanmugaratnam Political Career : సింగపూర్‌కు 9వ అధ్యక్షుడిగా ఎన్నికైన థర్మన్‌ షణ్ముగరత్నం 2011 నుంచి 2019 వరకు.. సింగపూర్‌ ఉప ప్రధానిగా సేవలందించారు. 2019 - 2023 మధ్యకాలంలో సీనియర్‌ మంత్రిగా కేబినెట్‌లో విధులు నిర్వహించారు. ప్రముఖ ఆర్థికవేత్తగా అంతర్జాతీయంగా పేరు గాంచిన షణ్ముగరత్నం సింగపూర్‌లో స్థిరపడ్డ తమిళ కుటుంబంలో 1957లో పుట్టారు.

లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ నుంచి పట్టా పొందారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో మాస్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ.. హార్వర్డ్‌ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ ఇన్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేశారు. విద్యార్థిదశలో క్రీడల్లో చురుగ్గా ఉండేవారు. "ఫాదర్‌ ఆఫ్‌ పాథాలజీ ఇన్‌ సింగపూర్‌"గా పేరున్న వైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ కె.షణ్ముగరత్నం కుమారుడే థర్మన్‌ షణ్ముగరత్నం. స్థానిక న్యాయవాది జేన్‌ యుమికో ఇట్టోగిని ఆయన వివాహం చేసుకున్నారు.

గతంలో వీరే..
Singapore President Indian Origin : గతంలో భారత సంతతికి (తమిళ) చెందిన సెల్లప్పన్‌ రామనాథన్‌ సింగపూర్‌కు అందరికన్నా ఎక్కువ కాలం అధ్యక్షుడిగా పని చేసి రికార్డు సృష్టించారు. 1981-85 మధ్య మలయాళీ అయిన చెంగర వీటిల్‌ దేవన్‌ నాయర్‌ అధ్యక్షుడిగా పని చేశారు.

China Construction In Aksai Chin : కయ్యాలమారి కవ్వింపు.. అక్సాయ్​ చిన్​లో చైనా భారీ నిర్మాణాలు

XI Jinping G20 India : పుతిన్ బాటలో జిన్​పింగ్.. భారత్​లో G20 సదస్సుకు డుమ్మా!

Last Updated : Sep 2, 2023, 10:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.