ETV Bharat / international

రన్నింగ్​ వెహికల్​ నుంచి కాల్పులు.. 8మంది మృతి.. మరో 10 మంది.. - shooting in school several died in serbia

రన్నింగ్​ వెహికల్​ నుంచి ఓ వ్యక్తి కాల్పులు జరిగిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు. సెర్బియాలో జరిగిందీ ఘటన.

shooting in school several died and injured in serbia
రన్నింగ్​ వెహికల్​ నుంచి కాల్పులు.. 8మంది మృతి.. మరో 10 మందికి గాయాలు
author img

By

Published : May 5, 2023, 8:24 AM IST

Updated : May 5, 2023, 8:41 AM IST

సెర్బియాలో పాఠశాలలో కాల్పుల ఘటన మురువక ముందే మరో దారుణం జరిగింది. కదులుతున్న వాహనం నుంచి ఓ వ్యక్తి.. కాల్పులు జరిపాడు. రాజధాని బెల్​గ్రేడ్​కు 50 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో పది మందికి పైగా గాయపడ్డారు. ఆటోమేటిక్ వెపన్‌తో కాల్పులు జరిపి వెంటనే 21 ఏళ్ల నిందితుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. రెండు రోజుల వ్యవధిలో సెర్బియాలో జరిగిన రెండో సామూహిక కాల్పుల ఘటన ఇది.

పాఠశాలలో కాల్పులు..
బుధవారం.. సెర్బియాలోని ఓ పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 8 మంది విద్యార్థులు కాగా మరొకరు స్కూల్​లో గార్డుగా పని చేస్తున్న వ్యక్తి. అదే పాఠశాలలో చదివే ఓ టీనేజీ బాలుడు.. ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాల్పులు జరిపిన బాలుడు వయసు సుమారు 14 ఏళ్లు. సెంట్రల్​ బెల్​గ్రేడ్​లోని వ్లాదిస్లావ్ రిబ్నికర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం తన తండ్రి తుపాకీని తీసుకుని అతడు బడికి వచ్చాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 9 మంది చనిపోగా.. మరో ఆరుగురు విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు. ఈ మారణ కాండపై సెర్బియా విద్యార్థులు సహా అనేక మంది నలుపు రంగు దుస్తులు ధరించి గురువారం మౌనం పాటించి నివాళులర్పించారు.

"మా అమ్మాయి చెప్పిన దాని ప్రకారం.. అతడు (నిందితుడు) లోపలకు వచ్చి ముందుగా ఓ టీచర్​పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత భయంతో డెస్క్​ల కింద దాక్కున్న విద్యార్థుల్ని షూట్ చేశాడు. కాల్పులు జరిపిన వ్యక్తి.. ఇంతకుముందు బాగానే ఉండేవాడని, బాగా చదివే వాడని మా అమ్మాయి చెప్పింది." అని ఓ విద్యార్థిని తల్లి చెప్పారు.

పాక్​లో 8 మంది ఉపాధ్యాయులు కాల్చివేత
వాయవ్య పాకిస్థాన్‌లోని పఖ్తున్‌ఖ్వా ప్రావిన్సు అప్పర్‌ కుర్రమ్‌ గిరిజన జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో 8 మంది పాఠశాల ఉపాధ్యాయులను కాల్చి చంపారు. అఫ్గానిస్థాన్‌ సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో మతపరమైన హింసను ప్రేరేపించేలా ఈ లక్షిత దాడులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సున్నీ తెగకు చెందిన మహమ్మద్‌ షరీఫ్‌ అనే ఉపాధ్యాయుడి కారుపై గుర్తుతెలియని సాయుధులు మెరుపుదాడి చేసి కాల్చి చంపినట్లుగా వెల్లడించారు. ఈ ఉదంతం షరీఫ్‌ స్వస్థలమైన తేరి మెంగల్‌ పట్టణంలో ఆగ్రహావేశాలకు దారి తీసింది. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలపై దాడి చేసిన అల్లరిమూక షియా వర్గానికి చెందిన ఏడుగురు ఉపాధ్యాయులను కాల్చి చంపింది.

Last Updated : May 5, 2023, 8:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.