ETV Bharat / international

బ్రిటన్​ ఓటర్ల మద్దతు రిషి సునాక్​వైపే.. ఏకంగా 48 శాతంతో ముందంజ! - బ్రిటన్‌ ప్రధాని తాజా వార్తలు

UK Opinion Poll: బ్రిటన్‌ ప్రధాని రేసులో ఉన్న భారతీయ సంతతికి చెందిన రిషి సునాక్​కే అక్కడి అధికార పార్టీ నేతలు జై కొడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన మెజారిటీ ఓటర్లు రిషి సునాక్‌వైపు మొగ్గుచూపినట్లు తేలింది.

రిషి సునాక్
రిషి సునాక్
author img

By

Published : Jul 18, 2022, 3:03 AM IST

Updated : Jul 18, 2022, 6:29 AM IST

UK Opinion Poll: బ్రిటన్‌ ప్రధాని రేసులో ఉన్న భారతీయ మూలాలున్న రిషి సునాక్​కే అక్కడి అధికార పార్టీ నేతలు జై కొడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో కన్జర్వేటివ్‌ పార్టీకి చెందిన మెజారిటీ ఓటర్లు రిషి సునాక్‌వైపు మొగ్గుచూపినట్లు తేలింది. ముఖ్యంగా రిషి సునాక్‌ ప్రధానిగా ఎన్నికైతే ఓ 'మంచి ప్రధాని'గా ఉండగలరనే విశ్వాసాన్ని వ్యక్తం చేసినట్లు ఆదివారం వెల్లడైన ఒపీనియన్‌ పోల్స్‌ పేర్కొన్నాయి. ప్రస్తుతం కన్జర్వేటివ్‌ పార్టీ నాయకుడి ఎన్నిక జరుగుతుండగా.. వారిలో గెలిచిన వ్యక్తే ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న సంగతి తెలిసిందే.

బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా తర్వాత ప్రధానమంత్రి పదవికి జరుగుతోన్న రేసులో భారతీయ మూలాలున్న రిషి సునాక్ వైపు పాజిటివ్‌ పవనాలు వీస్తున్నాయి. ఆ దేశ ఆర్థికమంత్రిగా ఉన్న రిషి సునాక్‌కు తాజాగా నిర్వహించిన ఒపీనియన్‌ పోల్స్‌లో 4400 మందికిపైగా మద్దతు ప్రకటించినట్లు బ్రిటన్‌ మీడియా వెల్లడించింది. దాదాపు 48శాతం ఓట్లతో రిషి సునాక్‌ తొలిస్థానంలో ఉండగా.. విదేశాంగ మంత్రిగాఉన్న లిజ్‌ ట్రూజ్‌ 39శాతం ఓట్లతో రెండోస్థానంలో ఉన్నారు. మూడోస్థానంలో ఉన్న వాణిజ్యశాఖ మంత్రి పెన్నీ మార్డాంట్‌కు 33శాతం మంది ఓటర్ల మద్దతు లభించింది.

ఇలా వివిధ విభాగాల్లో అడిగిన ప్రశ్నలకు రిషిపైనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ‘సునాక్‌ వైపే బలమైన మద్దతు కొనసాగుతోంది. ప్రధాని బాధ్యతల్లో మంచి వ్యక్తిగా రిషి సునాక్‌ ఉంటారని మూడులో ఒకటోవంతు ఓటర్లు భావిస్తుండగా.. మరొకవంతు దీన్ని సమర్థించలేదు. అన్‌పాపులర్‌ విభాగంలో పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ ప్రతికూలంగా ఉండగా.. మొత్తంగా రిషి సునాక్‌ అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా కొనసాగుతున్నారు’ అని జేఎల్‌ పార్ట్‌నర్స్‌ సహవ్యవస్థాపకుడు జేమ్స్‌ జాన్సన్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, ఇప్పటివరకు జరిగిన రెండు రౌండ్ల ఓటింగ్‌లోనూ రిషి సునాక్‌ ముందంజలో ఉన్నారు. రానున్న వారాల్లో జరిగే ఓటింగ్‌లో అభ్యర్థుల మధ్య పోటీ మరింత తీవ్రం కానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టోరి ఎంపీల్లో (అధికారపార్టీ) అధికశాతం మద్దతు రిషికే ఉండగా.. కేవలం కొందరు మాత్రమే మరో అభ్యర్థి మార్డాంట్‌కు ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో ఈ పోటీలో రిషి సునాక్‌ గెలువకుండా తాత్కాలిక ప్రధానిగా ఉన్న బోరిస్‌ జాన్సన్‌ ప్రయత్నాలు చేస్తున్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలుబడుతున్నాయి. సునాక్‌ ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రధాని కావద్దని.. ఆయనను తప్ప మరెవరినైనా బలపరచండని తన వర్గం ఎంపీలకు జాన్సన్‌ సూచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

..

ఇవీ చదవండి: చైనా దూకుడుకు కళ్లెం.. 'ఆకస్​' నెక్ట్స్​ టార్గెట్​ భారత్​.. మళ్లీ తెరపైకి ఖలిస్థాన్​ వాదం..

నడిసంద్రంలో 18గంటల పోరాటం.. ఆటబొమ్మ సాయంతో..

Last Updated : Jul 18, 2022, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.