ETV Bharat / international

'ఉక్రెయిన్​లో 6లక్షల మంది రష్యన్ సైనికులు- లక్ష్యాలేం మారలేదు, యుద్ధం కంటిన్యూ!' - రష్యా సైనికులు ఎంతమంది

Putin Russian Soldiers : ఉక్రెయిన్‌ విషయంలో తమ లక్ష్యాలేవీ మారలేదని, వాటిని సాధించే వరకు శాంతి స్థాపన ప్రస్తావనే ఉండదని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్పష్టం చేశారు. రష్యాకు చెందిన దాదాపు 6.17 లక్షల మంది సైనికులు ప్రస్తుతం ఉక్రెయిన్​తో జరుగుతున్న యుద్ధభూమిలో ఉన్నారని తెలిపారు.

Putin Russian Soldiers
Putin Russian Soldiers
author img

By PTI

Published : Dec 14, 2023, 10:09 PM IST

Putin Russian Soldiers : ఉక్రెయిన్‌- రష్యా సైనిక చర్య మొదలై 22 నెలలు అవుతోంది. సైన్యం విషయంలో ఇరువైపులా పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిణామాల నడుమ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ కీలక విషయాన్ని వెల్లడించారు. రష్యాకు చెందిన దాదాపు 6.17 లక్షల మంది సైనికులు ప్రస్తుతం యుద్ధభూమిలో ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్‌ విషయంలో తమ లక్ష్యాలేవీ మారలేదని, వాటిని సాధించే వరకు శాంతి స్థాపన ప్రస్తావనే ఉండదని పుతిన్​ స్పష్టం చేశారు. ఈ క్రమంలో మాస్కో వేదికగా నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో పుతిన్‌ మాట్లాడారు.

"ప్రస్తుతం ఉక్రెయిన్‌లో దాదాపు 6.17 లక్షల మంది రష్యా సైనికులు ఉన్నారు. వారిలో దాదాపు 2.24 లక్షల మందిని సుశిక్షిత సైనిక బలగాలతో కలిసి పోరాడేందుకు సమీకరించాం. ప్రస్తుతానికి మరో సైనిక సమీకరణ అవసరం లేదు. దేశవ్యాప్తంగా రోజూ 1500 మంది కొత్తగా సైన్యంలో చేరుతున్నారు. బుధవారానికి 4.86 లక్షల మంది సైనికులు రష్యా సైన్యంతో సంతకాలు చేశారు."

-పుతిన్, రష్యా అధ్యక్షుడు

వార్షిక మీడియా సమావేశంలో పాత్రికేయులతోపాటు సామాన్య పౌరుల నుంచి కూడా ఫోన్‌ ద్వారా ప్రశ్నలను ఆహ్వానించారు. రెండు వారాల వ్యవధిలో దాదాపు 20 లక్షల ప్రశ్నలు వచ్చినట్లు స్థానిక వార్తాసంస్థలు వెల్లడించాయి. గతేడాది పుతిన్‌ ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించలేదు. రెండు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉన్న పుతిన్‌ వచ్చే ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించిన వేళ ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, ఉక్రెయిన్‌ నిస్సైనికీకరణ, నాజీవాదం నిర్మూలన, తటస్థ వైఖరి అవలంబించాలనే లక్ష్యాలతో ఉక్రెయిన్‌పై మాస్కో సైనిక చర్యను ప్రారంభించింది.

'అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్​ వైపే మొగ్గు'
మరోవైపు, ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 2024లో జరగనున్న రష్యా అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్ధానికి, అధ్యక్షుడు పుతిన్‌కు రష్యన్లు భారీగా మద్దతు పలకడమే అందుకు కారణం. రష్యాను 24 ఏళ్లగా పుతిన్‌ పరిపాలిస్తూ వస్తున్నారు. ఐదోసారి కూడా రష్యా అధ్యక్ష పదవిని పుతిన్‌ చేపట్టడం ఖాయమని సర్వేలు అభిప్రాయపడుతున్నాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

బైడెన్​కు అభిశంసన ముప్పు- ట్రంప్ ప్రోత్సాహంతో ఏకమైన రిపబ్లికన్లు!

హమాస్​తో యుద్ధం​- ఆ రెండు దేశాల ఫార్ములాకు ఇజ్రాయెల్ నో- అమెరికా, బ్రిటన్ ఎస్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.