ETV Bharat / international

గోల్డ్​మైన్​లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది కార్మికులు మృతి - అమెరికాలో విదేశీయులపైకి దూసుకెళ్లిన కారు

Peru gold mine fire : పెరూలోని ఓ గోల్డ్​మైన్​లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 27 మంది కార్మికులు చనిపోయారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు అమెరికాలో బస్​స్టాప్​ నిల్చున్న ప్రయాణికులపై ఓ కారు దూసుకెళ్లింది. ఘటనలో 8 మంది మృతి చెందారు.

Peru gold mine fire
Peru gold mine fire
author img

By

Published : May 8, 2023, 9:21 AM IST

Updated : May 8, 2023, 10:52 AM IST

Peru gold mine fire : ఓ గోల్డ్​మైన్​లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో దాదాపు 27 మంది కార్మికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. కార్మికులు నైట్​ షిఫ్ట్​ పనుల్లో నిమగ్నమై ఉండగా గనిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దక్షిణ పెరులోని యానాకిహువా మైనింగ్​ కంపెనీకి చెందిన గనిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం సహాయక చర్యలు చేపట్టి.. మొత్తం 175 మంది కార్మికులను ప్రమాదం నుంచి సురక్షితంగా కాపాడినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగినట్లు వారు వివరించారు. షార్ట్​​ సర్కూట్​ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

అమెరికాలో విదేశీయులపైకి దూసుకెళ్లిన కారు.. 8 మంది మృతి..
america road accident today : అమెరికాలోని ఓ బస్​స్టాప్​​ వద్ద బస్​ కోసం వేచి చూస్తున్న విదేశీయులపైకి కారు దూసుకెళ్లింది. ఘటనలో అమెరికా పౌరులతో సహా మొత్తం 8 మంది అక్కడికక్కడే మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. హ్యూస్టన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పది మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు వెల్లడించారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
నిర్లక్ష్యంగా వాహనం నడిపి 8 మంది మృతికి కారణమైన నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అతడ్ని జైలులో ఉంచినట్లు వారు వెల్లడించారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే.. ఉద్దేశ పూర్వకంగా చేశారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన జరిగినప్పుడు బస్​ షెల్టర్​ వద్ద 20 నుంచి 25 మంది బస్ కోసం​ వేచి చూస్తున్నారని.. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ కారు వారిని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా బాధితులు.. రెండు మూడు రోజుల క్రితమే వెనిజులా నుంచి అమెరికాకు వచ్చారు.

దుబాయ్​లో భారీ అగ్నిప్రమాదం నలుగురు భారతీయులు సహా 16 మంది మృతి..
Dubai building fire accident : కొద్ది రోజుల క్రితం దుబాయ్​లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు భారతీయులు సహా మొత్తం 16 మంది మరణించారు. మరో 9 మంది గాయపడ్డారు. అల్ రస్ ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారు. వీరు భార్యాభర్తలు. తమిళనాడుకు చెందిన మరో ఇద్దరు పురుషులు కూడా అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరు ఆ భవనంలో పని చేస్తున్నారు. భవనం నాల్గవ అంతస్తులో.. మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ఇతర విభాగాల సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తెచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

Last Updated : May 8, 2023, 10:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.