ETV Bharat / international

ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. అన్నింటికంటే డేంజర్​! - కరోనా కొత్త వేరియంట్

New Omicron strain: మరో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ 'ఎక్స్​ఈ' పుట్టుకొచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. యూకేలో మొదటగా గుర్తించిన ఈ వేరస్ రకం​.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

New Omicron strain
వేరియంట్
author img

By

Published : Apr 3, 2022, 5:34 AM IST

Updated : Apr 3, 2022, 6:41 AM IST

New Omicron strain: కరోనా నుంచి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో మరో కొత్త ఒమిక్రాన్ వేరియంట్ పుట్టుకొచ్చినట్లు తెలిపింది డబ్ల్యూహెచ్​ఓ. యూకేలో మొదటగా గుర్తించిన ఈ వైరస్​ రకం.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్​ నుంచి ఇంకా ముప్పు పొంచే ఉందని తెలిపిన డబ్ల్యూహెచ్​ఓ.. వైరస్ కట్టడి చర్యలను తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. బీఏ1, బీఏ2 రకాల కలయికతో ఉన్న వైరస్​ 'ఎక్స్​ఈ'ను జనవరి 19న గుర్తించినట్లు పేర్కొంది. అప్పటి నుంచి దాదాపు 600 రకాలను పరిశీలించినట్లు నివేదికలో పేర్కొంది.

బీఏ 2 రకం కంటే పది రెట్ల ఎక్కువగా వ్యాప్తి చెందే సామర్థ్యం ఈ కొత్త రకం వేరియంట్​కు ఉందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. దీనిపై ఇంకా పరిశోధనలు అవసరమని అభిప్రాయపడింది. వైరస్ లక్షణాలు, తీవ్రతలోనూ తెడాలున్నట్లు పేర్కొంది. ప్రపంచంలో ఇటీవల పలు దేశాల్లో టెస్టింగ్​లు గణనీయంగా తగ్గించడంపై డబ్ల్యూహెచ్​ఓ ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వైరస్ వ్యాప్తిని అంచనా వేయలేమని తెలిపింది. దీనివల్ల ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య, మరణాలు పెరుగుతాయని హెచ్చరించింది.

ఇదీ చదవండి: బ్రిటన్​లో కరోనా విజృంభణ.. వారంలో 50లక్షల కేసులు

Last Updated : Apr 3, 2022, 6:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.