నేపాల్ ఎంపీ చంద్ర భండారి ఇంట విషాదం నెలకొంది. బుధవారం అర్థరాత్రి ఆయన ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఎంపీతో సహా ఆయన తల్లి తీవ్ర గాయాలపాలయ్యారు. కాలిన గాయాలతో ఎంపీ తల్లి కన్నుమూశారు. చంద్ర భండారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదీ జరిగింది..
బుధవారం అర్థరాత్రి.. ఎంపీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఎంపీ శరీరం 25 శాతం కాలిపోగా.. ఆయన తల్లి శరీరం 80 శాతం కాలిపోయింది. వెంటనే ఎంపీతో సహా ఆయన తల్లిని చికిత్స నిమిత్తం కీర్తిపుర్ ఆస్పత్రికి తరలించారు. అయితే సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవటం వల్ల వారిని ప్రత్యేక హాస్పిటల్కు తరలించాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. ముంబయి ప్రత్యేక ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. ఈలోపలే ఎంపీ తల్లి చనిపోయారు.