ETV Bharat / international

భార్యతో సెక్స్​.. ఆ తర్వాత పది నిమిషాలకే మతిమరుపు

ఓ వ్యక్తి తన భార్యతో సెక్స్​లో పాల్గొన్న పది నిమిషాలకే మతిమరుపునకు గురయ్యాడు. ఆ తర్వాత మొబైల్​లో తేదీ చూసుకుని, ముందురోజు తన పెళ్లి రోజు కదా.. అదెలా మర్చిపోయా అంటూ ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటన ఐర్లాండ్​లో జరిగింది.

sex man woman
sex man woman
author img

By

Published : May 29, 2022, 5:20 AM IST

Updated : May 29, 2022, 6:43 AM IST

భార్యతో శృంగారం చేసిన పది నిమిషాలకే మతిమరుపునకు గురయ్యాడొక వ్యక్తి. ఐర్లాండ్‌లో జరిగిన ఈ విచిత్రమైన సంఘటనను 'ఐరిష్‌ జర్నల్‌' ప్రచురించింది. ఈ జర్నల్‌ కథనం ప్రకారం.. 66 ఏళ్ల ఐరిష్‌ వ్యక్తి తన భార్యతో శృంగారం చేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి తన మొబైల్లో తేదీని చూసుకొని, ముందు రోజు తన పెళ్లి రోజు కదా.. అదెలా మర్చిపోయా అంటూ ఆశ్చర్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెబితే వారు మరింత షాక్‌కు లోనయ్యారు.

కారణం.. ముందు రోజు సాయంత్రం ఇంట్లో పెళ్లి రోజు వేడుక ఘనంగా జరగడమే. ఆ సంఘటనను భర్త ఎలా మరిచిపోయారో భార్యకు అర్థం కాలేదు. దీంతో ముందు రోజు సాయంత్రం జరిగిన వేడుకలను పదే పదే జ్ఞప్తికి తెచ్చేందుకు భార్యాపిల్లలు ప్రయత్నించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. అయితే తన పేరు, వయసు, పాత విషయాలను మాత్రం ఆ వ్యక్తి గుర్తుపెట్టుకోవడం విశేషం. దీన్ని వైద్యులు స్వల్పకాలిక మతిమరుపుగా పేర్కొన్నారు. వైద్య పరిభాషలో ట్రాన్సియంట్‌ గ్లోబల్‌ అమ్నీషియా (టీజీఏ) అంటారని తెలిపారు. ఇది 50 నుంచి 70 ఏళ్ల మధ్య వారిపై ప్రభావం చూపిస్తుందని అన్నారు. 2015లో కూడా ఈ వ్యక్తి టీజీఏ ప్రభావానికి లోనయ్యారు. ఆ సమయంలోనూ భార్యతో శృంగారం చేసిన తర్వాతే కావడం గమనార్హం.

ఇవీ చదవండి: 'అన్నీ మర్చిపోయి ముందుకు సాగండి'.. మాజీ ప్రేయసిపై మస్క్ ట్వీట్

జీతం కూడా తీసుకోలేదు.. నేనో పెద్ద ఫూల్​ని: పాక్​ ప్రధాని

Last Updated : May 29, 2022, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.