Israel Hamas War Effect On Jerusalem : ప్రపంచంలో ఎంతో చారిత్రాత్మకమైన ప్రముఖ నగరంగా విరజిల్లితోన్న జెరూసలేం ఇప్పడు ఎడారిని తలపిస్తోంది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న జరిగిన హమాస్ దాడితో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. తర్వాత ఇజ్రాయెల్ ప్రతిదాడులలో గాజా దద్దరిల్లుతోంది. అయితే ఈ ప్రభావం నేరుగా జెరుసలేంపైనా పడింది. ఈ పరిస్థితుల వల్ల ఈ నగరానికి సందర్శకులు రావడం పూర్తిగా ఆగిపోయింది. ఉన్నవారు కూడా ముందు జాగ్రత్తతో ఈ నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. ఫలితంగా నగరంలో పర్యటకులు లేక వ్యాపారాలు జరగక.. దుకాణాలన్నీ మూతపడ్డాయి.

నిర్మానుష్యంగా మారిన జెరూసలేం..
ఎప్పుడూ వ్యాపారాలతో కిటికిటలాడె జెరూసలేంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. స్థానికులే అప్పుడప్పుడు అవసరాల కోసం బయటకు వస్తున్నారు తప్ప మరెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెలీలే కాక పాలస్తీనా పౌరులు కూడా ఇక్కడ వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం వారందరి జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది.


యూదులు, క్రైస్తవులు, ముస్లీములే కాక.. ఇతర పర్యాటకులు కూడా ఈ ప్రాంతాన్ని చూసేందుకు ఆసక్తి కనబరుస్తుంటారు. నిత్యం వేలమంది ఈ ఇక్కడకు వస్తుంటారు. వ్యాపారులే కాక టూరిస్ట్ గైడ్‌లూ జీవనోపాధి కోల్పోయారు. రోజుకు దాదాపు 16 వేల రూపాయలు సంపాదించే గైడ్‌లు ప్రస్తుతం రోడ్డునపడ్డారు. కరోనా సమయంలో ఇలాంటి పరిస్థితులను చూశామనీ మళ్లీ ఇప్పుడే ఆ పరిస్థితులు గోచరిస్తున్నాయని వారంతా ఆవేదన చెందుతున్నారు. ఇజ్రాయోల్ సైనిక చర్యలతో తమ జీవితాలు తారుమారయ్యాయని జెరూసలెం ప్రజలు తెలిపారు.

ఆగని మారణకాండ.. ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణల్లో వేల మంది మృతి..
Israel vs Palestine War : గత కొద్ది రోజులుగా జరుగుతున్న యుద్ధంతో ఇజ్రాయెల్, పాలస్తీనాల్లో మరణ మృదంగం మోగుతోంది. హమాస్ మిలిటెంట్లు, ఇజ్రాయెల్ సైన్యం జరుపుతున్న మారణకాండ వల్ల ఇరుదేశాల్లో వేల మంది మరణించారు. మృతి చెందిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారు. గత కొన్ని దశాబ్దాల్లోనే.. అత్యంత దారుణమైన ఈ ఘటనలతో రెండు ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలోనే హమాస్‌పై దాడులు మరింత తీవ్రతరం చేసేందుకు ఇజ్రాయెల్ సిద్ధపడింది.
India Help Palestine : పాలస్తీనాకు భారత్ మానవతా సాయం.. ప్రత్యేక విమానంలో గాజాకు 39 టన్నుల సామగ్రి