ETV Bharat / international

​ ప్రార్థనా మందిరంలో కాల్పులు.. ఎనిమిది మంది మృతి - జర్మనీ చర్చిలో కాల్పులు

జర్మనీలోని హాంబర్గ్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. యెహోవా విట్​నెస్​ ప్రార్థనా స్థలంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు వారు వెల్లడించారు. దాడికి తెగబడ్డ వ్యక్తి కూడా.. మృతుల్లో ఉన్నట్లు తెలిపారు.

shooting-at-jehovah-witness-place-of-worship-in-german-several-killed
​ ప్రార్థనా స్థలంలో కాల్పులు.. ఎనిమిది మంది మృతి
author img

By

Published : Mar 10, 2023, 5:09 PM IST

Updated : Mar 10, 2023, 7:10 PM IST

జర్మనీలోని హాంబర్గ్ నగరంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఓ గర్భవతి కూడా ఉన్నారు. యెహోవా విట్​నెస్​ ప్రార్థనా స్థలంలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు వారు వెల్లడించారు. దాడికి తెగబడ్డ వ్యక్తి కూడా.. మృతుల్లో ఉన్నట్లు తెలిపారు.

"గురువారం రాత్రి ఎనిమిది గంటల తరువాత మాకు ఓ ఫోన్​ కాల్ వచ్చింది. మేము అక్కడకు చేరుకునే సరికే.. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. మరికొంత మంది మృతి చెందారు. వెంటనే ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని అంతమొందించాం." అని పోలీసులు తెలిపారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టినట్లు వారు వెల్లడించారు. హుటాహుటిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.

కాల్పులకు పాల్పడ్డ వ్యక్తిని 35 ఏళ్ల ఫిలిప్ ఎఫ్‌గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. అతడు జర్మన్ జాతీయుడేనని వెల్లడించారు. ఈ దాడిలో అతడు 100 రౌండ్లకు పైగా కాల్పులు జరిపినట్లు వివరించారు. కాల్పుల్లో మొత్తం ఎనిమిది మంది గాయపడ్డారని.. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. నిందితుడికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లుగా.. ఎటువంటి ఆధారాలు లేవని వారు వెల్లడించారు. నిందితుడు లైసెన్స్​డ్​​ గన్​ను, లీగల్​గా సెమీ-ఆటోమెటిక్​ ​పిస్తోల్​ను కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

2020 సంవత్సరంలోనూ కాల్పులు..
2020 ఫిబ్రవరి 20న జర్మనీలోని హనావ్​ నగర కేంద్రంలో ఆగంతుకులు తుపాకులతో విరుచుకుపడ్డారు. రాత్రి 10 గంటల తర్వాత ఈ ఘటన జరిగింది. ఆనాడు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు హుక్కా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిగాయి. 8 నుంచి 9 సార్లు తుపాకీ శబ్దం వినిపించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అక్కడి నుంచి దుండగులు మరో హుక్కా కేంద్రానికి వెళ్లి మరోసారి కాల్పులకు తెగబడ్డారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతున్న గన్​కల్చర్​..
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నానాటికీ గన్​కల్చర్​ పెరుగుతూ వస్తోంది. అమెరికాలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. 2023 ఫిబ్రవరి నెలలో అమెరికాలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. మిషిగన్ రాష్ట్రం ఈస్ట్‌ లాన్సింగ్‌లో ఉన్న మిషిగన్‌ స్టేట్ యూనివర్సిటీలో ఒక వ్యక్తి జరిపిన కాల్పుల్లో ముగ్గురు చనిపోగా ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఎనిమిదిన్నరకు యూనివర్సిటీలోని బెర్కే హాల్‌లో దుండగుడు కాల్పులు జరిపాడు.

అమెరికాలోని వాషింగ్టన్​లో కాల్పులు..
వాషింగ్టన్​లోని యాకిమా ప్రాంతంలో ఉన్న ఓ కన్వీనియన్స్​ స్టోర్​లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది గాయాలపాలయ్యారు. 2023 జనవరి 25న ఈ ఘటన జరిగింది. కాల్పులు జరిపిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

Last Updated : Mar 10, 2023, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.