ETV Bharat / international

Gaza Ground Attack : గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. హమాస్‌ వైమానిక దళాధిపతి హతం.. 150 భూగర్భ కేంద్రాలు ధ్వంసం - గాజాపై భూతల దాడులు

Gaza Ground Attack : గాజాలోని భూగర్భ కేంద్రాల్లో దాక్కుని పోరాటం చేస్తున్న హమాస్ బలగాలను ఇజ్రాయెల్‌ ఏరివేస్తోంది. ఒక పక్క భూతల దాడులు చేస్తూనే మరోపక్క హమాస్‌ భూగర్భ టన్నెళ్లపై భీకరంగా విరచుకుపడింది. 150 భూగర్భ కేంద్రాలను ధ్వంసం చేసింది. దాడుల్లో హమాస్‌ వైమానిక దళాల అధిపతి మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.

Gaza Ground Attack
Gaza Ground Attack
author img

By PTI

Published : Oct 28, 2023, 3:13 PM IST

Updated : Oct 28, 2023, 3:23 PM IST

Gaza Ground Attack : గాజా స్ట్రిప్‌లో హమాస్‌ను ఏరివేసే లక్ష్యంతో భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయల్‌ రక్షణ బలగాలు(IDF)... శుక్రవారం రాత్రి నుంచి మరింతగా విరుచుకుపడుతున్నాయి. హమాస్‌కు చెందిన 150 భూగర్భ కేంద్రాలపై దాడులు చేసినట్లు ప్రకటించాయి. శుక్రవారం రాత్రి చేపట్టిన భూతల దాడుల్లో హమాస్‌ బలగాలతో పెద్ద ఎత్తున పోరాటం జరిగినట్లు ఇజ్రాయెల్‌ టైమ్స్‌ వార్తా సంస్థ తెలిపింది. ఈ దాడుల్లో సైనికులెవరూ గాయపడలేదని వివరించింది. అనేక మంది హమాస్ సభ్యులను హతమార్చామని వారికి చెందిన అనేక మౌలిక సదుపాయాలు నాశనం చేశామని IDF చెబుతోంది. భూతల ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నందున IDF ఇంజనీరింగ్ దళాలు, ట్యాంకులు ప్రస్తుతం గాజా పట్టీ లోపలే పోరాటం చేస్తున్నాయి.

Gaza Ground Attack
గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడి

Gaza Ground Operation : గాజాలో పూర్తిస్థాయి భూతల దాడులకు బదులుగా సైనికచర్యను ఉద్ధృతం చేసినట్లు IDF చెబుతోంది. వారికి తోడుగా ఇజ్రాయెల్ వైమానిక బలగాలు.. గాజా పట్టీలోని హమాస్‌కు చెందిన 150 భూగర్భ కేంద్రాలను నాశనం చేశాయని తెలిపింది. తీవ్రవాదుల పోరాట టన్నెళ్లు, భూగర్భ కేంద్రాలు, వారి మౌలిక సదుపాయాలను దాడుల్లో నాశనం చేసినట్లు వెల్లడించింది. హమాస్‌ వైమానిక దళాల అధిపతి అసెమ్ అబు రకబా ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో హతమైనట్లు IDF ధ్రువీకరించింది. హ‌మాస్‌కు చెందిన డ్రోన్లు, ఏరియ‌ల్ వెహికల్స్‌, ప్యారాగ్లైడ‌ర్స్‌, ఏరియ‌ల్ డిటెక్షన్ వ్యవస్థలను అబూ రకబా పర్యవేక్షించేవాడిని ఐడీఎఫ్‌ తెలిపింది. ఇజ్రాయెల్‌పై అక్టోబర్‌ ఏడున హ‌మాస్ చేసిన భీక‌ర రాకెట్ దాడిలో అబూ రకబా కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. రకబా ఆదేశాల మేరకే హ‌మాస్‌కు చెందిన పారాగ్లైడ‌ర్లు ద‌క్షిణ ఇజ్రాయెల్ భూభాగంలోకి వ‌చ్చిన‌ట్లు తెలిపింది. త‌మ ర‌క్షణ ద‌ళాల పోస్టుల‌పై జరిగిన డ్రోన్ల దాడికి కూడా అసెమ్‌ నేతృత్వం వహించినట్లు ఇజ్రాయెల్‌ తెలిపింది.

Gaza Ground Attack
గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడి

Israel Ground Invasion Gaza : ఇజ్రాయెల్ దాడులకు ప్రతిగా హమాస్‌ సభ్యులు... ఆ దేశంపైకి రాత్రంతా రాకెట్లు ప్రయోగిస్తూనే ఉన్నారు. గాజా నుంచి వచ్చే రాకెట్ల కారణంగా ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాల్లో రాత్రంగా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. శనివారం ఉదయానికి గాజాలో బాంబుల మోత తగ్గినప్పటికీ... చెదురుమదురు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనేక చోట్ల భారీగా పొగ వెలువడింది. గాజాలో భూతల దాడులను ఉద్ధృతం చేసినట్లు IDF అధికార ప్రతినిధి ఇప్పటికే ప్రకటించారు. హమాస్‌ తీవ్రవాదులు, వారి పాలనా మౌలిక సదుపాయలను నాశనం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

Gaza Ground Attack
గాజాపై ఇజ్రాయెల్ భూతల దాడి

Israel Gaza War : దుర్భర పరిస్థితుల్లోకి గాజా.. ఇంటర్నెట్​​ బంద్​.. ఇజ్రాయెల్​ టార్గెట్ రీచ్!

Israel Iron Sting : ఇజ్రాయెల్‌ 'ఐరన్‌ స్టింగ్‌'.. ఒకే రౌండ్‌తో లక్ష్యాలన్నీ ధ్వంసం!

Last Updated : Oct 28, 2023, 3:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.