ETV Bharat / international

China Nuclear Warheads : 'భారత్‌ పొరుగున 500 అణువార్‌హెడ్‌లు.. పెద్ద ఎత్తున నిర్మాణాలు'.. చైనాపై పెంటగాన్‌ రిపోర్ట్ - చైనా అణు వార్​హెడ్​లు

China Nuclear Warheads : చైనా అణువార్‌ హెడ్‌ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటోందని అమెరికా రక్షణ శాఖ నివేదిక పేర్కొంది. గత రెండేళ్లలోనే డ్రాగన్‌ కొత్తగా 100 వార్‌హెడ్‌లు పెంచుకుని మొత్తం వాటి సంఖ్యను 500కు చేర్చింది. భారత్‌తో సరిహద్దుల వద్ద చైనా మిలటరీ భారీ సంఖ్యలో మోహరించడమే కాకుండా  అక్కడ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు పెంటగాన్‌ తెలిపింది.

China Nuclear Warheads
China Nuclear Warheads
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2023, 9:02 PM IST

China Nuclear Warheads : చైనా సైన్యం భారీగా అణ్వాయుధాలను సమకూర్చుకుంది. 2021తో పోలిస్తే వీటి సంఖ్య ఏకంగా 100 పెరిగినట్లు గుర్తించారు. డ్రాగన్‌ సైన్యంలో జరుగుతున్న అత్యంత కీలకమైన పరిణామాలపై అమెరికాకు చెందిన పెంటగాన్‌ వార్షిక నివేదికలో ప్రస్తావించింది. దీని ప్రకారం చైనా వద్ద ప్రస్తుతం 500 అణు వార్‌హెడ్‌లు వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి సంఖ్య 2030 నాటికి వెయ్యికి చేరే అవకాశం ఉంది.

ప్రస్తుతం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ వద్ద 300 ఖండాంతర క్షిపణులు భూగర్భ బొరియల్లో సిద్ధంగా ఉన్నాయి. దేశంలోని మూడు ప్రదేశాల్లో క్షిపణులు మోహరించడానికి వీలుగా భూగర్భ బొరియలను 2022లో డ్రాగన్‌ నిర్మించింది. సంప్రదాయ వార్‌హెడ్‌లను ప్రయోగించే ఖండాంతర క్షిపణి వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి చైనా ప్రయత్నాలను తీవ్రం చేసింది.

ప్రపంచంలోనే అత్యధికంగా 370 యుద్ధనౌకలు చైనా వద్ద ఉన్నాయి. ఈ సంఖ్య 2025 నాటికి 395కు 2030 నాటికి 435కు పెరగవచ్చు. విదేశాల్లో మిలటరీ బేస్‌లను ఏర్పాటు చేయడానికి డ్రాగన్‌ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. మయన్మార్‌, థాయ్‌లాండ్‌, ఇండోనేసియా, యూఏఈ, కెన్యా, నైజీరియా, నమీబియా, మొజాంబిక్‌, బంగ్లాదేశ్‌, పపువా న్యూగినియా, సాల్మన్‌ ఐలాండ్స్‌, తజకిస్థాన్‌ వంటి చోట్ల చైనా లాజిస్టిక్స్‌ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చైనా నౌకాదళంలో ఏడాది కాలంలో 30 సరికొత్త షిప్‌లను వచ్చి చేరాయి.

మరోవైపు భారత్‌తో సరిహద్దుల వద్ద చైనా పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపట్టినట్లు పెంటగాన్‌ తన నివేదికలో పేర్కొంది. అండర్‌గ్రౌండ్‌ స్టోరేజీలు, కొత్త రోడ్లు, సైనిక-పౌర వినియోగానికి వీలుగా ఎయిర్‌ పోర్టులు, భారీ సంఖ్యలో హెలిప్యాడ్లు నిర్మిస్తోందని చెప్పింది. అదే సమయంలో డోక్లాం వద్ద కూడా అండర్‌గ్రౌండ్‌ స్టోరేజీ ఫెసిలిటీలను ఏర్పాటు చేసింది. భూటాన్‌ సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతానికి సమీపంలో గ్రామాల నిర్మాణం చేపట్టింది. 2020లో భారత్‌-చైనా మధ్య ఘర్షణల తలెత్తిన తర్వాత వాస్తవాధీన రేఖ వద్ద చైనా భారీగా సైన్యాన్ని మోహరించినట్లు అమెరికా తెలిపింది.

China Nuclear Weapons : అణ్వాయుధాలను చైనా వేగంగా అభివృద్ధి చేస్తోందంటూ గతేడాది జనవరిలో అమెరికా ఆరోపించింది. అప్పుడు అమెరికా చేసిన ఆరోపణలను బీజింగ్ ఖండించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది. తన అణు సంపదను.. దేశ భద్రతకు, అంతర్జాతీయ సుస్థిరతకు అవసరమైన స్థాయిలోనే ఉంచుకున్నట్లు తెలిపింది. అణు యుద్ధాలు జరగకుండా చూస్తామని భద్రతా మండలిలోని ఐదు సభ్య దేశాలు(పీ5) అంగీకారానికి రావడం చైనా వల్లే సాధ్యమైందని చెప్పుకొచ్చింది. ఆయుధ పోటీ ఉండకుండా తొలి ప్రకటన వెలువడే విషయంలో చైనా కీలకంగా వ్యవహరించిందని కితాబిచ్చుకుంది.

సరిహద్దులో బలగాల ఉపసంహరణపై చర్చలు.. అందుకు ఓకే చెప్పిన చైనా!

'అణు'మానాలు ఎన్నిఉన్నా అత్యంత సంయమనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.