Canada Hindu Threat : దేశంలో ద్వేషం, అభద్రత, భయాలకు చోటు లేదని స్పష్టం చేసింది కెనడా. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరికల వీడియో వైరలైన నేపథ్యంలో.. ఈ మేరకు స్పందించింది. ప్రతి ఒక్కరూ.. పరస్పరం గౌరవించుకుంటూ చట్టాలను పాటించాలని సూచించింది కెనడా ప్రజా భద్రతా విభాగం. కెనడాలో అన్ని మతాల పౌరులకు భద్రత ఉంటుందని చెప్పింది.
అంతకుముందు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. 'కెనడా వ్యతిరేక చర్యలకు పాల్పడుతోన్న కొంతమంది ఇండో- హిందువులు.. కెనడా పట్ల నిబద్ధతను చాటడం లేదు' అని గురుపత్వంత్ పన్నూ చెబుతున్నట్లున్న ఓ వీడియో వైరల్‌గా మారింది.
భారత్ సహకరించాలని కెనడా వినతి
Canada India Tensions News : ఖలిస్ధానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ హస్తం ఉందని చేసిన వ్యాఖ్యలను కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సమర్థించుకున్నారు. కెనడా గడ్డపై ఒక కెనెడియన్‌ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారనడానికి తమవద్ద విశ్వసనీయ కారణాలు ఉన్నాయన్నారు. తమ పౌరులను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. బలమైన, స్వతంత్ర న్యాయవ్యవస్థ ఉన్న దేశంగా.. న్యాయ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం తమకు ఉందన్నారు. తమ పౌరుడి హత్యను భారత్ తీవ్రంగా పరిగణించాలనీ పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయాన్ని నిర్ధరించడానికి తమతో కలిసి పనిచేయాలని భారత్‌కు సూచించారు. దీనిపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో స్పష్టంగా మాట్లాడాననీ.. ఆయన ఎదుట తన ఆందోళనలను వ్యక్తపరిచానని చెప్పారు.
-
#WATCH | "As I said on Monday, there are credible reasons to believe that agents of the Govt of India were involved in the killing of a Canadian on Canadian soil, which is something of utmost and foundational importance in the country of rule of law, in a world where… pic.twitter.com/tKV5EXeyez
— ANI (@ANI) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | "As I said on Monday, there are credible reasons to believe that agents of the Govt of India were involved in the killing of a Canadian on Canadian soil, which is something of utmost and foundational importance in the country of rule of law, in a world where… pic.twitter.com/tKV5EXeyez
— ANI (@ANI) September 21, 2023#WATCH | "As I said on Monday, there are credible reasons to believe that agents of the Govt of India were involved in the killing of a Canadian on Canadian soil, which is something of utmost and foundational importance in the country of rule of law, in a world where… pic.twitter.com/tKV5EXeyez
— ANI (@ANI) September 21, 2023
-
#WATCH | Canadian PM Justin Trudeau says, "I call upon the Govt of India to work with us, to take seriously these allegations and to allow justice to follow its course."
— ANI (@ANI) September 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Source: Reuters) pic.twitter.com/lVhnLQNSwG
">#WATCH | Canadian PM Justin Trudeau says, "I call upon the Govt of India to work with us, to take seriously these allegations and to allow justice to follow its course."
— ANI (@ANI) September 21, 2023
(Source: Reuters) pic.twitter.com/lVhnLQNSwG#WATCH | Canadian PM Justin Trudeau says, "I call upon the Govt of India to work with us, to take seriously these allegations and to allow justice to follow its course."
— ANI (@ANI) September 21, 2023
(Source: Reuters) pic.twitter.com/lVhnLQNSwG
ధీటుగా కౌంటర్ ఇచ్చిన భారత్
India On Canada Allegations : మరోవైపు కెనడా ప్రధాని ట్రూడో వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. జీ 20 సదస్సు సందర్భంగా ట్రూడో ఈ అంశాన్ని ప్రధాని వద్ద ప్రస్తావించారనీ.. దాన్ని మోదీ అప్పుడే తిప్పికొట్టారని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా ఎలాంటి సమాచారాన్ని పంచుకోలేదని తెలిపింది. భారత అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం చేసుకుంటోందనీ దానిని తగ్గించాల్సిన అవసరం ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.
'భారత్, కెనడా వివాదాన్ని సీరియస్‌గా తీసుకున్నాం'
మరోవైపు భారత్, కెనడాల మధ్య వివాదంపై అమెరికా స్పందించింది. ఖలిస్థాన్ వేర్పాటువాద నేత హర్దీప్‌సింగ్ హత్యలో భారత్ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి కెనడా ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నట్లు తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలకు ఏ దేశం కూడా ప్రత్యేక మినహాయింపు పొందలేదని పేర్కొంది. 2 దేశాలతో ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులేవాన్ చెప్పారు. ఈ అంశం తమకు ఆందోళన కలిగిస్తోందని.. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నామనీ ఏ దేశంతో సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని తెలిపారు. నిజ్జార్ హత్య విషయంలో అమెరికా, కెనడాల మధ్య దూరం పెరిగిందన్న వాదనలను సులేవాన్ ఖండించారు. కెనడా వంటి మిత్రదేశాలు వారి సొంత చట్టాలు, దౌత్య ప్రక్రియను కొనసాగిస్తున్నప్పుడు వారితో సన్నిహితంగా ఉంటామని పేర్కొన్నారు. ఈ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి, నేరస్థులపై చర్యలు తీసుకోవాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
India Suspends Visa Services in Canada : కెనడా ప్రజలకు వీసాలు బంద్.. భారత్ కీలక నిర్ణయం
India Cautions Students On Canada : 'కెనడాలోని భారతీయులు జాగ్రత్త'.. కేంద్రం వార్నింగ్