Canada Huawei 5G ban: చైనాకు చెందిన హువావే టెక్నాలజీని నిషేధిస్తూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయం తీసుకున్నారు. 5G మౌలిక సదుపాయాల కల్పనలో హువావే పాత్రను వ్యతిరేకించాలని కెనడా ప్రభుత్వంపై అమెరికా చాలాకాలంగా ఒత్తిడి చేస్తోంది. ఒకవేళ ఈ సాంకేతికతను అనుమతిస్తే కెనడియన్లపై చైనా మరింత సులభంగా నిఘా ఉంచుతుందని అమెరికా హెచ్చరించింది. ఫలితంగా హువావే టెక్నాలజీని వినియోగించడంపై నిషేధం విధించాలని కెనడా ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కెనడా పబ్లిక్ సేఫ్టీ మంత్రి మార్కో మెండిసినో ధ్రువీకరించారు.
ఫోన్లు, ఇంటర్నెట్ కంపెనీలకు అతిపెద్ద సరఫరాదారుగా ఉన్న హువావే.. సాంకేతికతలో చైనా అంతర్జాతీయ శక్తిగా ఎదుగుదలకు చిహ్నంగా ఉంది. చైనా కంపెనీలు అంతర్జాతీయ నియమ, నిబంధనలను ఉల్లంఘించాయని... సాంకేతికతను దొంగిలించాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కెనడా తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, హువావేపై బ్రిటన్ రెండేళ్ల క్రితమే నిషేధం విధించింది. 5జీ నెట్వర్క్ నుంచి హువావేను నిషేధించింది. యూకేలోని 5జీ నెట్‌వర్క్‌ల నుంచి 2027 కల్లా హువావే పరికరాలను పూర్తిగా తొలగించాలని నిర్ణయించింది. హువావేను అమెరికా నిషేధించడమే కాకుండా.. పలు కఠిన ఆంక్షలను విధించింది.
ఇదీ చదవండి: