ETV Bharat / international

గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు.. రంగంలోకి వాయుసేన.. టెన్షన్ టెన్షన్! - బాంబు ఉన్న విమానాన్ని అనుసరించిన భారత వాయుసేన

plane bomb threat
plane bomb threat
author img

By

Published : Oct 3, 2022, 11:20 AM IST

Updated : Oct 3, 2022, 1:06 PM IST

11:13 October 03

గాల్లో ఉన్న విమానానికి బాంబు బెదిరింపు.. రంగంలోకి వాయుసేన.. టెన్షన్ టెన్షన్!

ఇరాన్​కు చెందిన ఓ పాసింజర్ విమానంలో బాంబు ఉందన్న హెచ్చరిక.. కలకలం రేపింది. ప్రయాణికులతో చైనా వెళ్తున్న ఈ విమానం భారత గగనతలంలో ఉండగా ఈ సమాచారం అందింది. విమానం దిల్లీలో ల్యాండ్​ కావడానికి అనుమతించలేదు. వెంటనే భారత వాయుసేన రంగంలోకి దిగింది. రెండు ఫైటర్ జెట్​లతో ఆ విమానాన్ని అనుసరించింది.

ఇరాన్​లోని తెహ్రాన్​ నుంచి చైనాలోని గ్వాంగ్‌జౌ వెళ్తున్న మహన్​ ఎయిర్​ విమానంలో బాంబు ఉందని సోమవారం ఉదయం 9 గంటల 20 నిమిషాలకు దిల్లీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో దిల్లీలో ల్యాండ్ అవ్వడానకి అనుమతించలేదు. ఆ విమానాన్ని జైపుర్​ మళ్లించాల్సిందిగా ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) సూచించింది. దీనికి ఇరానియన్ పైలట్లు నిరాకరించారు. వెంటనే భారత వాయుసేన రంగంలోకి దిగింది. సుఖోయ్-30ఎంకేఐ ఫైటర్ జెట్​లు పంజాబ్​, జోధ్​పుర్ ఎయిర్ బేస్​ల నుంచి బయలు దేరి సురక్షిత దూరంలో ఆ పాసింజర్ విమానాన్ని అనుసరించాయి. అయితే ఇరాన్​ ప్రభుత్వ యంత్రాంగం ఆ విమానాన్ని అలాగే చైనా వైపు వెళ్లేందుకు అనుమతించాలని కోరిందని వాయుసేన అధికారులు తెలిపారు. దీంతో భారత వాయిసేన ఫైటర్ జెట్​లు వెనుదిరిగాయని చెప్పారు.

ఇవీ చదవండి: రష్యా సైనికుల అకృత్యాలు.. వెలుగులోకి 10 చిత్రహింస కేంద్రాలు.. సామూహికంగా..

స్టేడియంలో 'ఫ్యాన్స్​ ఫైట్​'​.. ఇలాంటి విషాదాలు ఎన్నో.. ఆ మ్యాచ్​లో ఏకంగా 20వేల మంది!

Last Updated : Oct 3, 2022, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.