ETV Bharat / international

బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా రాజధాని.. 100 మంది మృతి - మొగడిషులో వరుస పేలుళ్లు

సోమాలియా రాజధాని బాంబు పేలుళ్లతో ఒక్కసారిగా దద్దరిల్లింది. దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కొనడానికి ప్రధానితో సహా ఉన్నతాధికారులంతా చర్చిస్తున్న సమయంలో ఈ దాడులు సంభవించాయి. ఈ ఘటనలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధ్యక్షుడు తెలిపారు.

bomb-attack-in-somalia-capital
సోమాలియాలో బాంబు పేలుళ్లు
author img

By

Published : Oct 29, 2022, 10:08 PM IST

Updated : Oct 30, 2022, 11:06 AM IST

సోమాలియా రాజధానిలో ఒక్కసారిగా రెండు చోట్ల.. భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకవైపు దేశాధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చిస్తుండగా.. ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో కనీసం 100 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ మహముద్ తెలిపారు.

సోమాలియా శనివారం మధ్యాహ్నం జరిగిన రెండు పేలుళ్లతో రాజధానియైన మొగదిషు నగరం చిన్నాభిన్నమైంది. ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలు ఉండే ప్రాంతంలో ఈ దాడి జరిగింది.ఈ పేలుళ్లు విద్యా మంత్రిత్వశాఖ కార్యాలయం వద్ద జరిగాయి. ఈ పేలుళ్లకు తామే బాధ్యులమైన ఏ ఒక్కరూ స్పందించలేదు. అల్ ఖైదా అనుబంధ అల్ షబాబ్ గ్రూప్ జరుపుతున్న హింసాత్మక తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంపై చర్చించడానికి సోమాలియా అధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఇతర సీనియర్ అధికారులు సమావేశమైన రోజునే.. ఈ బాంబు దాడులు జరగడం విశేషం.

అల్ షబాబ్ తరచుగా హై-ప్రొఫైల్ ప్రదేశాలపై దాడులు చేస్తోంది. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈసారి పేలుళ్లకు కుట్రపన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. 2015 లో ఒకసారి విద్యాశాఖపై దాడి జరిగింది. జోబ్ జంక్షన్ వద్ద 2017 లో 500 మందికి పైగా మరణించిన పేలుళ్లకు అల్-షబాబ్ గ్రూప్​నే కారణమని తేలింది.

Last Updated : Oct 30, 2022, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.