ETV Bharat / international

Biden Israel : 'గాజా ఆస్పత్రిలో పేలుడు.. ఇజ్రాయెల్​ పనికాదు.. వేరే ఎవరో'.. నెతన్యాహుతో బైడెన్

Biden Israel : గాజా ఆస్పత్రి పేలుడు ఘటనకు ఇజ్రాయెల్​ సైన్యం కారణం కాదని తెలుస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఇది వేరే ఇతరులు చేసిన పనేనని చెప్పారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. ఆయన ఇజ్రాయెల్​లో పర్యటించారు.

Biden Israel
Biden Israel
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 18, 2023, 3:56 PM IST

Biden Israel : ఇజ్రాయెల్‌-హమాస్‌ మిలిటెంట్ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ఇజ్రాయెల్‌ పర్యటన చేపట్టారు. గాజా ఆస్పత్రిలో పేలుడుకు ఇజ్రాయెల్ సైన్యం కారణం కాదని తెలుస్తోందని జో బైడెన్​ తెలిపారు. టెల్‌అవీవ్​ చేరుకున్న తర్వాత బైడెన్​.. ఆ దేశ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. "నేను గమనించిన ప్రకారం.. ఇది మీ(ఇజ్రాయెల్) సైన్యం చేసిన దాడి కాదు.. ఇంకెవరో చేసినట్లు ఉంది" అని బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో అన్నారు. కానీ పేలుడుకు కారణమేమిటో కచ్చితంగా తెలియదని తెలిపారు. ఘటనా సమయంలో అక్కడ చాలా మంది ఉన్నట్లు పేర్కొన్నారు.

  • #WATCH | Israel | In Tel Aviv, US President Joe Biden says, "...I was deeply sad by the explosion at the hospital in Gaza yesterday. Based on what I have seen, it appears as though it was done by the other team, not you. But there are a lot of people out there, I am not sure..."… pic.twitter.com/f525yyfso1

    — ANI (@ANI) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'హమాస్‌ మిలిటెంట్లు దుర్మార్గాలకు పాల్పడ్డారు'
Biden Netanyahu : అంతకుముందు టెల్ అవీవ్​కు చేరుకున్న బైడెన్​కు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు, అధ్యక్షుడు ఇసాక్‌ ఎర్జోగ్‌లు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న మీడియాతో మాట్లాడారు బైడెన్‌. హమాస్‌ మిలిటెంట్లు దుర్మార్గాలకు పాల్పడ్డారని అన్నారు. ఇటువంటి సమయంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తున్న పోరుకు అమెరికా మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ అడుగుపెట్టినట్లు స్పష్టం చేశారు.

  • #WATCH | US President Joe Biden arrives in Tel Aviv, Israel amid Israel-Hamas conflict. Israel PM Benjamin Netanyahu and President Isaac Herzog receive him at Ben Gurion Airport.

    (Video Source: Reuters) pic.twitter.com/KD7qsp6VGw

'యావత్‌ ప్రపంచానికి చెప్పడానికే వచ్చా'
Biden Israel Visit : "నేను ఇక్కడకు రావడానికి ఒకేఒక చిన్న కారణం. అమెరికా ఎవరివైపు ఉంటుందనే విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రజలతో పాటు యావత్‌ ప్రపంచానికి చెప్పడానికే ఇక్కడకు వచ్చా. హమాస్‌ మిలిటెంట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారు. అవి ఐఎస్‌ఐఎస్‌ మాదిరిగానే ఉన్నాయి. పాలస్తీనియన్లందరికీ హమాస్‌ ప్రాతినిధ్యం వహించడం లేదనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇది వారికి బాధలనే మిగిల్చింది" అని బైడెన్‌ పేర్కొన్నారు.

మోదీ తీవ్ర దిగ్భ్రాంతి
Modi On Gaza Israel : గాజాలోని ఆస్పత్రిలో జరిగిన పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని అన్నారు. ఘటనకు సంబంధించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. "గాజాలోని అల్‌ అహ్లి ఆస్పత్రిలో పెను ప్రాణనష్టం సంభవించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రస్తుత ఘర్షణల్లో (ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరును ఉద్దేశిస్తూ) పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత తీవ్రమైన, ఆందోళనకర అంశం. ఇందుకు కారకులకు శిక్ష పడాలి" అని మోదీ.. ఎక్స్​ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

  • Deeply shocked at the tragic loss of lives at the Al Ahli Hospital in Gaza. Our heartfelt condolences to the families of the victims, and prayers for speedy recovery of those injured.

    Civilian casualties in the ongoing conflict are a matter of serious and continuing concern.…

    — Narendra Modi (@narendramodi) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారీ దాడిలో 500మంది బలి
Gaza Hospital Blast : మరోవైపు, సెంట్రల్‌ గాజాలోని అహ్లీ అరబ్‌ ఆస్పత్రిపై జరిగిన భారీ దాడిలో 500 మంది ప్రాణాలు కోల్పోయిన తరుణంలో జో బైడెన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. ఈ దాడులపై ఇజ్రాయెల్‌-గాజా అధికారుల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి. అది ఇజ్రాయెల్‌ సైన్యం చేసిన దాడి అని గాజా పేర్కొనగా.. ఇజ్రాయెల్‌ మాత్రం ఆ దాడులు హమాస్‌లు ప్రయోగించిన రాకెట్లు మిస్‌ఫైర్‌ అయినట్లు చెబుతోంది.

Biden Israel
గాజా ఆస్పత్రి ఆవరణ దృశ్యాలు
Biden Israel
గాజా ఆస్పత్రి ఆవరణలో సహాయక చర్యలు
Biden Israel
ధ్వంసమైన గాాజా ఆస్పత్రి
Biden Israel
ధ్వంసమైన గాాజా ఆస్పత్రి

Hamas Videos Israel Girl : బందీల వీడియో రిలీజ్.. ఇజ్రాయెల్​పై హమాస్ ఒత్తిడి! హెజ్​బొల్లా స్థావరాలు ధ్వంసం

Hamas Commander Killed : ఇజ్రాయెల్ దాడుల్లో హమాస్​ టాప్ కమాండర్ మృతి.. 'అదే జరిగితే వేలాది ప్రాణాలు గాల్లో!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.