ETV Bharat / international

'వచ్చే ఎన్నికల్లో గెలిచేది నేనే.. వారెవర్నీ వదిలిపెట్టను'.. ట్రంప్ స్ట్రాంగ్​ వార్నింగ్​ - అమెరికా క్యాపిటల్ భవనంపై దాడి

Capitol Hill USA Attack Case : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పలువురికి వార్నింగ్‌ ఇచ్చారు. బెదిరింపులతో కూడిన ఓ ప్రకటనను టీవీలో ప్రసారం చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో డోనాల్డ్ ట్రంప్‌ను అడ్డుకునేందుకు న్యాయశాఖ రంగంలోకి దిగింది. ఇంతకీ ఎవరికి వార్నింగ్ ఇచ్చాడంటే?

america Former President donald Trump
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
author img

By

Published : Aug 6, 2023, 7:18 AM IST

Donald Trump Indictment : తనను వేధిస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు, సాక్షులు, కోర్టుపరంగా సంబంధమున్న ఎవరినీ వదలబోనని.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ హెచ్చరించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయాలని యత్నించి.. శాంతియుత అధికార మార్పిడికి అడ్డు తగిలారనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన.. తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. తన సొంత సామాజిక మాధ్యమైన ట్రూత్‌ సోషల్‌లో ట్రంప్​ ఈ హెచ్చరికను జారీ చేశారు. దాంతో ఆగకుండా న్యాయశాఖ ప్రత్యేక న్యాయవాది జాక్‌ స్మిత్‌, మరో ఇద్దరు అటార్నీలపై బెదిరింపులతో కూడిన ప్రకటనను టీవీలో ప్రసారం చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో డోనాల్డ్ ట్రంప్‌ను అడ్డుకునేందుకు రంగంలోకి దిగింది న్యాయశాఖ. ట్రంప్‌ న్యాయ బృందం సాక్ష్యాధారాలను బయట పెట్టకుండా నిషేధాజ్ఞలు జారీ చేయాలని జిల్లా జడ్జి టాన్యా చట్కన్‌ను కోరింది.

వచ్చే ఎన్నికల్లో గెలిచేది నేనే : ట్రంప్
మరోవైపు శుక్రవారం అలబామా రాష్ట్ర రిపబ్లికన్‌ పార్టీ సమావేశంలో మాట్లాడిన ట్రంప్‌.. తన మీద మరో కేసు నమోదైతే వచ్చే ఎన్నికలో గెలిచేది తానేనని ప్రకటించారు. తన మీద కేసు పెట్టిన ప్రతిసారీ ప్రజాభిప్రాయ సేకరణలో తనకే మద్దతు పెరిగిపోతోందని ట్రంప్​ అభిప్రాయపడ్డారు. ట్రంప్‌పై కేసులు దాఖలు చేసిన ప్రభుత్వ న్యాయవాదులను బెదిరిస్తూ.. రూపొందించిన టీవీ వాణిజ్య ప్రకటన సోమవారం ప్రసారం కానుంది. వాషింగ్టన్‌, న్యూయార్క్‌, అట్లాంటా నగరాలతోపాటు జాతీయ కేబుల్‌ నెట్‌వర్క్‌లో ఈ ప్రసారం కానున్నట్లు తెలిసింది.

అమెరికా పార్లమెంటు భవనంపై దాడి కేసులో జిల్లా జడ్జి చట్కన్‌.. నిందితులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈమె మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో నియామకం అయ్యారు. ట్రంప్‌పై ఆరోపణల నిరూపణకు ప్రభుత్వం సమర్పిస్తున్న సాక్ష్యాధారాలను.. ఆయన లాయర్లు, సాక్షులు, వారి లాయర్లు, కోర్టు నియమించిన అధికారులకు తప్ప మరెవరికి చూపకూడదంటూ నిషేధాజ్ఞలు జారీ చేయాలని జడ్జి చట్కన్‌ను కోరింది న్యాయశాఖ.

డొనాల్డ్​ ట్రంప్​పై మరో క్రిమినల్​ కేసు.. ఏడాదిలో మూడోది!
వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో బరిలో దిగాలని చూస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​పై.. కొద్ది రోజుల క్రితం అక్కడి దర్యాప్తులో మరో కేసు నమోదు చేశాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని తిప్పిగొట్టడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్​ ట్రంప్​పై ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్​బీఐ).. క్రిమినల్ కేసు నమోదు చేసింది. అలాగే ఎన్నికల యంత్రాలను స్వాధీనం చేసుకోవడం, ట్యాంపరింగ్ ఆరోపణలపై ట్రంప్ సన్నిహితుడిపై క్రిమినల్ అభియోగాలు నమోదయ్యాయి.

'నేను నిర్దోషిని.. రాజకీయంగా ఎదుర్కొనలేకే ఇలా'.. కోర్టులో ట్రంప్ వాంగ్మూలం

పోర్న్​స్టార్​తో వివాదం.. మాజీ లాయర్​పై​ ట్రంప్​ రూ.4 వేల కోట్ల పరువు నష్టం దావా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.