ETV Bharat / international

పేద దేశాలకు కోటి టీకాలను అందించండి: డబ్ల్యూహెచ్​ఓ

వీలైనంత త్వరగా పేద దేశాలకు కోటి కొవిడ్ 19 వ్యాక్సిన్ డోసులను అందించాలని ధనిక దేశాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. టీకా సరఫరా సమస్యల కారణంగా ఇప్పటికీ 20 దేశాలకు తొలి టీకా తీసుకునే భాగ్యం దక్కలేదని చెప్పింది. ప్రైవేట్​ ఒప్పందాల కారణంగా పేద దేశాలకు టీకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

WHO asking rich countries to donate 10M vaccines
కోటి టీకాలను అందించండి: డబ్ల్యూహెచ్​ఓ
author img

By

Published : Mar 27, 2021, 8:36 AM IST

కనీసం కోటి కరోనా టీకా డోసులను పేద దేశాలకు అందించాలని సంపన్న దేశాలను కోరింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ). దీంతో 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చేయాలనే లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది.

కొవాక్స్​కు టీకా సరాఫరాల సమస్యల కారణంగా 20 దేశాలు ఇంకా తొలి వ్యాక్సిన్​ కూడా అందించలేకపోయాయని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​​ టెడ్రోస్ అధనోమ్​​ తెలిపారు. టీకా ఉత్పత్తిని పెంచాలని తయారీదారులను ఆయన కోరారు. పేద దేశాలకు వ్యాక్సిన్ సాయం చేసే అవకాశం కలుగుతుందని చెప్పారు.

ఫార్మసీ సంస్థలతో జరిగిన ప్రైవేట్ ఒప్పందాల కారణంగా వృద్ధి చెందుతున్న దేశాలకు టీకాలు స్వల్పంగా అందుతున్నాయని టెడ్రోస్ ఆక్షేపించారు. రాబోయే నెలల్లో కొవాక్స్​కు కోట్ల కొద్దీ వ్యాక్సిన్ల అవసరం అవుతుందని పేర్కొన్నారు. సరఫరాల్లో జాప్యం కారణంగా మే నాటికి 9 కోట్ల టీకాల లోటు ఏర్పడుతుందని కొవాక్స్ భాగస్వామి గవీ తెలిపింది.

ఇదీ చూడండి: భారత్​లో కరోనా విజృంభణతో 'కొవాక్స్​'పై ప్రభావం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.