WHO approves Novavax vaccine : కరోనా వైరస్‌ను అరికట్టేందుకు మరో టీకా వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ పచ్చజెండా ఊపింది. నొవావాక్స్ టీకాకు అత్యవసర అనుమతి మంజూరు చేసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం ప్రకటించింది. అమెరికా సంస్థ నొవావాక్స్ తయారు చేసిన ఈ టీకాను భారత్‌లో కొవొవాక్స్ పేరుతో సీరం ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఈ టీకా ఇప్పుడు గ్లోబల్ వ్యాక్సిన్- షేరింగ్ సిస్టమ్ కొవాక్స్‌లో భాగంగా పంపిణీ కానుంది.
'కరోనా కొత్త వేరియంట్‌లు వెలువడుతుండటంతో తీవ్రమైన అనారోగ్యం, మరణాల నుంచి ప్రజలను రక్షించేందుకు టీకాలు అత్యంత ప్రభావవంతమైన సాధనాల్లో ఒకటి. తక్కువ ఆదాయం గల దేశాల్లో మరింత మందికి టీకాలు ఇచ్చేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది' అని డబ్ల్యూహెచ్‌లో ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. తక్కువ ఆదాయం గల 41 దేశాల్లో ఇప్పటికీ 10 మంది కూడా టీకాలు పొందలేకపోయారని, 98 దేశాలు 40 శాతం కూడా తీసుకోలేదని డబ్ల్యూహెచ్‌లో సీనియర్ అధికారిణి మరియాంజెలో సిమావ్ తెలిపారు. ఈ అనుమతితో ఆయా దేశాల్లో మరింత మంది టీకాలు పొందే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.
Novavax vaccine news
నొవావాక్స్ టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థకు దరఖాస్తు ప్రక్రియ పూర్తయిందని సీరమ్ గత నెల మొదట్లోనే వెల్లడించింది. నొవావాక్స్ రూపొందించిన NVX-CoV2373 టీకా సామర్థ్యానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌వోకు అందించినట్లు పేర్కొంది. ఈ టీకా 90శాతం సమర్థత కలిగి ఉన్నట్లు ప్రయోగాల్లో వెల్లడైంది. బ్రిటన్, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లోనూ 89 శాతం ప్రభావశీలత కలిగినట్లు తేలింది. ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లకు భిన్న సాంకేతికతతో నొవావాక్స్‌ను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా స్పైక్ ప్రొటీన్‌ను గుర్తించి, వైరస్‌పై దాడి చేసేందుకు శరీరాన్ని సిద్ధం చేసేలా ఈ వ్యాక్సిన్ రూపొందించారు. ఈ టీకా 5 కోట్ల డోసులను ఎగుమతి చేసేందుకు కేంద్రం కొద్దిరోజుల క్రితమే అనుమతి ఇచ్చింది.
Novavax vaccine approval
నొవావ్యాక్స్కు డబ్ల్యూహెచ్ఓ అనుమతి ఇవ్వడంపై సీరం సంస్థ సీఈఓ అదర్ పూనావాలా ఆనందం వ్యక్తం చేశారు. కరోనాపై పోరులో ఇది కీలక మైలురాయి అన్నారు.
ఇదీ చదవండి: భూప్రపంచంలో 1,306 కాళ్లు ఉన్న ఏకైక జీవి ఇదే..