ఐరోపావ్యాప్తంగా పెరుగుతున్న దాడుల నేపథ్యంలో బ్రిటన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉగ్ర ముప్పును గణనీయమై స్థాయి నుంచి 'తీవ్ర' స్థాయికి పెంచింది జాయింట్ టెర్రరిజం ఎనలైసిస్ సెంటర్.
ఇది ఆ దేశంలో రెండో అతిపెద్ద హెచ్చరిక. దీని ప్రకారం.. ఉగ్రదాడి జరిగే అవకాశం ముందుకన్నా ఎక్కువగా ఉందని అర్థం. దేశవ్యాప్తంగా పోలీసుల మోహరింపు, భద్రతా చర్యలు పెంచుతారు. అయితే ఇది ముందస్తు చర్యల్లో భాగమని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆస్ట్రియా వియన్నా నగరంలోని ఓ ప్రార్థనా మందిరం వద్ద కాల్పులు కలకలం సృష్టించాయి. కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. 22 మంది గాయపడ్డారు. మరోవైపు ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో ఓ క్రైస్తవ మతాధికారిపై గుర్తు తెలియని వ్యక్తి శనివారం కాల్పులు జరిపాడు.
ఇదీ చూడండి- అధ్యక్ష పోరు: ఓటేసేందుకు బారులుతీరిన అమెరికన్లు