ETV Bharat / international

క్రిస్మస్​ కోసం బ్రిటన్​లో ఆంక్షల సడలింపు - UK CHRISTMAS BUBBLE

క్రిస్మస్ పర్వదినం కోసం బ్రిటన్​లో లాక్​డౌన్ ఆంక్షలను సడలించారు. మూడు కుటుంబాలు కలిసి ఒకచోట పండగ జరుపుకునే విధంగా ప్రజలకు అవకాశం ఇచ్చారు. చర్చిలు, ప్రార్థనా స్థలాలు దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ నిర్ణయం వల్ల బ్రిటన్​లోని ఏ దేశానికైనా ప్రజలు ప్రయాణాలు చేసే వీలుంటుంది.

UK PM Johnson offers days off from lockdown to form 'Christmas bubble'
క్రిస్మస్​ కోసం బ్రిటన్​లో ఆంక్షల సడలింపు
author img

By

Published : Nov 25, 2020, 6:07 PM IST

క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో బ్రిటన్​లో లాక్​డౌన్ ఆంక్షలను సడలించనున్నారు. డిసెంబర్ 23 నుంచి 27 మధ్య ప్రజలు.. కలిసి పండగ జరుపుకోవచ్చని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. ఒక కుటుంబం మరో రెండు కుటుంబాలతో కలిసి 'క్రిస్మస్ బబుల్' వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. బ్రిటన్​లోని నాలుగు దేశాలు ఇందుకు అంగీకరించినట్లు వెల్లడించారు.

ఈ నిర్ణయం వల్ల మూడు కుటుంబాలు కలిసి పండగ నిర్వహించుకునేందుకు యూకేలోని నాలుగు దేశాల్లో(ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉత్తర ఐర్లాండ్, వేల్స్) ఏ దేశానికైనా ప్రయాణాలు చేసుకొనే అవకాశం లభించనుంది. చర్చిలు, ఇతర ప్రార్థనా స్థలాలు దర్శించుకునే వీలు ఉంటుంది. నాలుగు రోజుల పాటు మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది.

జాగ్రత్త!

అయితే క్రిస్మస్ జరుపుకొనే సమయంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని బోరిస్ అభ్యర్థించారు. ఇది సాధారణ క్రిస్మస్ కాదని.. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ వెసులుబాటును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు.

"మనం జాగ్రత్తలను గాలికి వదిలేయకూడదు. ఇది క్రిస్మస్ అని వైరస్​కు తెలియదు. మనమంతా జాగ్రత్తగా ఉండాలి. పండగ ప్రణాళికలు వేసుకొనేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి."

-బోరిస్ జాన్సన్, బ్రిటన్ ప్రధానమంత్రి

వచ్చే ఏడాది పరిస్థితులు కాస్త కుదుటపడొచ్చని అంచనా చేశారు బోరిస్. మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని కోరారు.

ఇంగ్లాండ్​లో ప్రస్తుతం కట్టుదిట్టమైన లాక్​డౌన్ కొనసాగుతోంది. ఇది వచ్చే బుధవారం వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత కఠినమైన మూడంచెల ఆంక్షల వలయం అమలవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.