వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేను అమెరికాకు అప్పగించటానికి బ్రిటన్ కోర్టు నిరాకరించింది. అలా చేయడాన్ని క్రూరమైన చర్యగా అభివర్ణించారు జిల్లా జడ్జి వనెస్సా బరైట్సర్. అసాంజే మానసిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఒకవేళ అమెరికాకు అప్పగిస్తే అసాంజే ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందన్నారు.
ఒక జర్నలిస్ట్‌గా అసాంజే.. భావప్రకటనా స్వేచ్ఛలో భాగంగానే అమెరికా దౌత్యవిధానాలను బయటపెట్టారని ఆస్ట్రేలియా న్యాయవాది అన్నారు. అసాంజే చర్య భావప్రకటనా స్వేచ్ఛ కిందకు రాదని అమెరికా రక్షణ విభాగం చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
అయితే బ్రిటన్ కోర్టు నిర్ణయంపై తాము అప్పీల్‌కు వెళ్తామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. అసాంజేపై 17 గూఢచర్య కేసులు ఉన్నాయని అమెరికన్ లాయర్లు కోర్టుకు వివరించారు. ఈ కేసుల్లో ఆయన 175 సంవత్సరాలు శిక్షపడే అవకాశం ఉందని చెప్పారు.
ఇదీ చదవండి : అసాంజే: పారదర్శకతకు ప్రతీకా? రాజద్రోహా?