ETV Bharat / international

ఇతర వైద్య సేవలపై కరోనా ప్రభావం: డబ్ల్యూహెచ్​ఓ

కరోనా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలు దెబ్బతిన్నాయని డబ్ల్యూహెచ్​ఓ చేసిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. సుమారు 90 శాతం దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాయి. ఇతర వైద్య సేవలను అందించటంలోనూ సమస్యలు ఉన్నట్లు స్పష్టం చేశారు.

author img

By

Published : Aug 31, 2020, 10:54 PM IST

VIRUS-WHO-SURVEY
డబ్ల్యూహెచ్​ఓ

కరోనా మహమ్మారి కారణంగా ఆరోగ్య వ్యవస్థలు ధ్వంసమైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 105 దేశాల్లో సంస్థ చేపట్టిన సర్వే ఆధారంగా తక్కువ, మధ్య స్థాయి ఆదాయ దేశాల్లో ఆరోగ్య వ్యవస్థపై కరోనా సంక్షోభం తీవ్ర ప్రభావం చూపినట్లు వెల్లడించింది.

కరోనా ప్రబలినప్పటి నుంచి ఇతర వైద్య సేవల విషయంలో అంతరాయం ఏర్పడిందని 70 శాతం దేశాలు అంగీకరించినట్లు డబ్ల్యూహెచ్​ఓ చీఫ్ టెడ్రోస్ అధనోమ్​ స్పష్టం చేశారు.

"హృద్రోగ సంబంధ వ్యాధులు, క్యాన్సర్​, కుటుంబ నియంత్రణ తదితర చికిత్స, డయాగ్నోసిస్​కు సంబంధించి 90 శాతం దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. మన ఆరోగ్య వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కరోనా వంటి అత్యవసర పరిస్థితుల్లో సన్నద్ధత అవసరం."

- టెడ్రోస్ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ చీఫ్

డబ్ల్యూహెచ్​ఓ ఈ సర్వేను మార్చి- జూన్​ మధ్య కాలంలో చేపట్టింది. అయితే, ఈ సర్వేకు కొన్ని పరిమితులు ఉన్నాయని సంస్థ వెల్లడించింది. దేశాల స్వీయ మదింపును పరిగణనలోకి తీసుకోవటం వల్ల కొన్ని తప్పిదాలు ఉండొచ్చని పేర్కొంది. సర్వే పూర్తయ్యే నాటికి ఆయా దేశాల్లో పరిస్థితులు మారి ఉండవచ్చని తెలిపింది.

ఇదీ చూడండి: ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల 51 లక్షలు దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.