ETV Bharat / international

'అందరికీ వ్యాక్సిన్ అందేంత వరకు​ విశ్రమించం' - కరోనా స్ట్రెయిన్​

ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేంతవరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) శ్రమిస్తూనే ఉంటుందని ఆ సంస్థ డెరెక్టర్​ జనరల్​ టెడ్రోస్ అధనామ్ స్పష్టం చేశారు. వైరస్​ ప్రబలిన సంవత్సరంలోనే వ్యాక్సిన్​ తయారు చేసి, పంపిణీ చేయటంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది 'అద్భుతమైన సాంకేతిక విజయం' అని శాస్త్రవేత్తలను కొనియాడారు.

Tedros: WHO won't rest until all countries have vaccine
'అన్ని దేశాలకు వ్యాక్సిన్​ వచ్చేంతవరకు శ్రమిస్తాం'
author img

By

Published : Dec 29, 2020, 5:41 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్​ జనరల్​ టెడ్రోస్ అధనామ్​ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని దేశాల్లో కరోనా వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చేంతవరకు డబ్ల్యూహెచ్​ఓ శ్రమిస్తూనే ఉంటుందని తెలిపారు. అతి తక్కువ సమయంలో కొవిడ్-19 వ్యాక్సిన్​ అభివృద్ధి చేసి, పంపిణీ చేయటంపై శాస్త్రవేత్తలను ప్రశంసించారు. దీనిని 'అద్భుతమైన సాంకేతిక విజయం'గా అభివర్ణించారు.

కరోనా స్ట్రెయిన్​ కారణంగా 2021లో కొత్త సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు టెడ్రోస్. కొత్త రకం కరోనా వైరస్​పై శాస్త్రవేత్తలతో కలిసి డబ్ల్యూహెచ్​ఓ పనిచేస్తుందని తెలిపారు. బ్రిటన్​లానే ఇతర దేశాల్లోనూ కరోనా స్ట్రెయిన్​పై పరీక్షలను కొనసాగించాలని సూచించారు.

ఇదీ చదవండి : '90శాతం దేశాల్లో ఆరోగ్య సేవలపై 'కరోనా' ఎఫెక్ట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.