ETV Bharat / international

అదరహో అనిపిస్తున్న కళాఖండాల ప్రదర్శన

స్పెయిన్​లో ప్రఖ్యాత చిత్రకారుడు అల్​బర్టో జెకొమెటీ చిత్రించిన అద్భుత కళాఖండాల ప్రదర్శన కళాప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మాడ్రిడ్​లో.. 'ప్రాడో' మ్యూజియంలో 200 ఏళ్ల పూర్తయిన సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహిస్తోంది.

స్పెయిన్​లో కొలువుదీరిన అపూర్వ కళాఖండాలు
author img

By

Published : Apr 7, 2019, 5:46 PM IST

స్పెయిన్​ మాడ్రిడ్​ నగరంలోని 'మ్యూసెయో నాసోనల్​ డెల్​ ప్రాడో' 200వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుత చిత్రపటాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో ప్రముఖ చిత్రకారుడు, శిల్పి అల్​బర్టో జెకొమెటీ కుంచె నుంచి జాలువారిన అద్భుత చిత్రపటాల ప్రదర్శన సందర్శకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

స్పెయిన్​లో కొలువుదీరిన అపూర్వ కళాఖండాలు

జెకొమెటీ వినూత్న రీతిలో మలిచిన ఈ చిత్రపటాలు, శిల్పాలు కళాప్రియుల మదిని దోచుకుంటున్నాయి. 16, 17 శతాబ్దాలనాటి అపురూప కళాఖండాల సరసన జెకొమెటీ చిత్రపటాలు, శిల్పాలను ప్రదర్శనకు ఉంచడం విశేషం.

డ్యూరో, రాఫెల్​, టిన్టోరేటో, ఎల్​గ్రీకో, గోయా లాంటి చిత్రకారులను స్ఫూర్తిగా తీసుకున్న జెకొమెటీ, తనదైన శైలిలో చిత్రపటాలను, శిల్పాలను రూపొందించారు.

జెకొమెటీ చిత్రపటాలు 'లాస్ మినినాస్', 'ది వాషింగ్​ ఆఫ్​ ది ఫీట్' కళాప్రియులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.​ 1960 నాటి 'వాకింగ్​ మ్యాన్-2', 'టాల్​ ఉమన్ -3', 'టాల్​ ఉమన్​-4', 'లార్జ్​ హెడ్' చిత్రపటాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

Virudhunagar (Tamil Nadu), Apr 07 (ANI): A photojournalist was manhandle and thrashed by congress workers during a public rally in Tamil Nadu's Virudhunagar. It is allegedly that photojournalist was clicking pictures of empty chairs at the public rally by the party.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.