శ్వేత వర్ణ వర్షాన్ని తలపించేలా కురుస్తొన్న మంచుతో చైనా ఈశాన్య రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు ధగధగ మెరిసిపోతున్నాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలన్నీ ధవళ వర్ణంతో తళతళలాడుతున్నాయి.
మంచుమయంగా
శ్వేతవర్ణ హిమంతో డ్రాగన్ దేశం వెలుగులు విరజిమ్ముతోంది. ఉత్తర చైనా లియాఓనింగ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన, ప్రపంచ ఎనిమిది వింతల్లో ఒకటైన అతిపెద్ద చారిత్రక కట్టడం 'ది గ్రేట్ చైనా వాల్' పూర్తిగా మంచుతో కప్పుకుంది. మరోపక్క జిలిన్ రాష్ట్రంలోని ప్రసిద్ధిగాంచిన చంగ్బాయ్ పర్వత ప్రాంతంలోని తియాంచి సరస్సు పూర్తిగా గడ్డకట్టింది. ఆ ప్రాంతంలోని వసంత పుష్పాలు గుబాళిస్తున్నాయి. ఆ పూల సొగసులు ప్రకృతి ప్రేమికుల్ని అలరిస్తున్నాయి.
ఈ ప్రాంతాల్లో మైనస్ 20డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ... ఈ సుందర దృశ్యాలను తిలకించడానికి పర్యటకులు భారీగా తరలివస్తున్నారు. ఈ మనోహర దృశ్యాల్ని చూసి ముగ్ధులవుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు.
మంచు తొలగింపు
మంచు వర్షంతో రహాదారులన్నీ హిమ దుప్పట్లు కప్పుకున్నాయి. అడుగుల మేర మంచు పేరుకుపోయింది. అయినప్పటికీ ఎప్పటికప్పుడు పర్యటకుల రవాణాకు అంతరాయం కలుగకుండా తగిన చర్యలు తీసుకుంటోంది అక్కడి యంత్రాంగం.
ఇదీ చూడండి : తండ్రికి తోడుగా ఆదిత్య- ఇక 'మహా' పాలనలోనూ కీలక పాత్ర