నెదర్లాండ్స్‌లోని శరణార్థుల కేంద్రంలో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. బుధవారం రాత్రి ఈ కేంద్రంలో కత్తులతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆమ్స్టర్డామ్కు 180 కి.మీ దూరంలో ఉన్న ఎక్ట్ నగరంలోని శరణార్థుల కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దాడికి గల కారణాలు ఇంకా తెలియలేదు.
రాత్రి 10.15 గంటలకు దాడికి సంబంధించి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. పది నిమిషాల్లోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు స్పష్టం చేశారు. ఘటన జరిగిన భవనంలోని ప్రజలను.. ఇతర ప్రాంతాలకు పంపించినట్లు వివరించారు.
ఇదీ చదవండి- అమెరికాలో నల్లజాతీయురాలిపై కాల్పులు