ETV Bharat / international

ఫ్రాన్స్​ మాజీ అధ్యక్షుడికి ఏడాది జైలు శిక్ష! - Nicolas Sarkozy

ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారన్న ఓ కేసులో.. ఫ్రాన్స్​ మాజీ అధ్యక్షుడు సర్కోజీని దోషిగా తేల్చింది కోర్టు.

దోషిగా తేలిన ఫ్రాన్స్​ మాజీ అధ్యక్షుడు, సర్కోజీ
author img

By

Published : Sep 30, 2021, 3:27 PM IST

ఫ్రాన్స్​ మాజీ అధ్యక్షుడు నికోలస్​ సర్కోజీని ఓ కేసులో దోషిగా తేల్చింది ఫ్రెంచ్​ కోర్టు. సంవత్సరం జైలు శిక్ష విధించింది. అయితే.. ఎలక్ట్రానిక్​ మానిటరింగ్​ బ్రేస్​లెట్​ ధరించి ఇంట్లోనే శిక్ష పూర్తి చేసేందుకు న్యాయస్థానం అనుమతిస్తుంది.

2012 అధ్యక్ష ఎన్నికల సమయంలో అక్రమంగా నిధులు సేకరించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులోనే ఇప్పుడు సర్కోజీని కోర్టు దోషిగా తేల్చింది.

దీనిపై ఆయనకు అప్పీల్​ చేసుకునే అవకాశముంది.

సర్కోజీ 2007-12 మధ్యలో ఫ్రాన్స్​ అధ్యక్షుడిగా పనిచేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.